ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా గురించి పట్టని కిమ్.. రికార్డు స్థాయిలో మిసైల్ ప్రయోగాలు

ABN, First Publish Date - 2020-03-30T02:33:13+05:30

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఏ రేంజ్‌లో వణికిస్తుందో తెలిసిందే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఏ రేంజ్‌లో వణికిస్తుందో తెలిసిందే. అయితే ఇంత విపత్కర పరిస్థితిని కూడా పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగాలు చేస్తుందో దేశం. అదే నార్త్ కొరియా. ఇందులో మరో విశేషమేంటంటే.. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్వయంగా ఈ ప్రయోగాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రెండు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్‌ను సముద్రంలో ప్రయోగించి చూసింది ఉత్తర కొరియా. దీనిపై దక్షిణ కొరియా అభ్యంతరాలు చెప్తోంది. ప్రపంచం విపత్కర పరిస్థితుల్లో ఉండగా ఈ ప్రయోగాలేంటని కిమ్‌ను ప్రశ్నిస్తోంది. ఆదివారం నాటి ప్రయోగాలతో మార్చి నెలలో ఉత్తర కొరియా 9 మిసైల్స్‌ను ప్రయోగించినట్లయింది. ఆ దేశ చరిత్రలో ఇన్ని మిసైల్ ప్రయోగాలు జరగడం ఇదే తొలిసారి. అయితే ఇవన్నీ కూడా షార్ట్ రేంజ్ మిసైల్సే కావడం విశేషం.


కాగా, ఉత్తర కొరియా ఓ శక్తివంతమైన వ్యూహాత్మక ఆయుధాన్ని తయారు చేస్తోందని, దాన్ని ఈ ఏడాదే విడుదల చేస్తామని గతంలోనే కిమ్ ప్రకటించారు. ఉత్తర కొరియాలో బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగాలు నిషేధించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆదేశాలున్నాయి. అయినా సరే, వాటిని లెక్కచేయకుండా మిసైల్స్, అణ్వాయుధాలకే కిమ్ ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు.

Updated Date - 2020-03-30T02:33:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising