ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్నేహంలో ప్రతీకారం ఉండదు.. ట్రంప్ వ్యాఖ్యలపై రాహుల్ స్పందన ఇదే

ABN, First Publish Date - 2020-04-07T22:11:46+05:30

భారత మరిన్ని ఆంక్షలు విధించడంతో ట్రంప్.. ప్రతీకారం తీర్చుకోవచ్చు అని వ్యాఖ్యానించారు. అయితే పెద్ద మనసుతో మందుల ఎగుమతులను భారత్ అనుమతించినప్పటికీ.. దీనిపై భారత్ రాజకీయ వర్గాలు అభ్యంతర వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా రాహుల్ గాంధీ కూడా దీనిపై స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా కారణంగా తీవ్రంగా అవస్థపడుతున్న దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్, పారాసిటమాల్ మందులను ఎగుమతి చేసేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అంతకుమునుపే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను అమెరికాకు ఎగుమతి చేసేందుకు అనుమతించాలంటూ అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీని కోరిన తెలిసిందే. ఆ తరువాత భారత్.. ఫార్మా ఎగుమతులపై మరిన్ని ఆంక్షలు విధించడంతో అమెరికా ప్రతీకారం తీర్చుకోవచ్చు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో కరోనా విలయతాండవం చేస్తున్న దృష్యా భారత్.. పెద్ద మనసుతో మందుల ఎగుమతులను  అనుమతించింది.


అయితే ట్రంప్ వ్యాఖ్యాలపై భారత రాజకీయ వర్గాలు అభ్యంతర వ్యక్తమవుతోంది. ఇటీవల కాంగ్రెస్ నేత శశిథరూర్ ట్రంప్ వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పగా తాజాగా రాహుల్ గాంధీ కూడా దీనిపై స్పందించారు. స్నేహంలో ప్రతీకారం ఉండదని కామెంట్ చేసిన ఆయన.. సహాయం కోరిన అన్ని దేశాలకు భారత్ చేయూత నందించాలన్నారు. ముందుగా భారత పౌరులకు అవసరమైన అత్యవసర మందులను ప్రభుత్వం తగినంత స్థాయిలో నిల్వచేసుకోవాలని సూచించారు. 

Updated Date - 2020-04-07T22:11:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising