పోలీసులపై పూల వర్షం కురిపించిన ముస్లింలు.. ఎక్కడంటే..
ABN, First Publish Date - 2020-04-05T22:54:38+05:30
కరోనా వైరస్‌పై పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసు యంత్రాగానికి ధన్యవాదాలు తెలుపుతూ.. ముస్లిం సామాజికవర్గానికి చెందిన స్థానికులు వారిపై
లక్నో: కరోనా వైరస్‌పై పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసు యంత్రాగానికి ధన్యవాదాలు తెలుపుతూ.. ముస్లిం సామాజికవర్గానికి చెందిన స్థానికులు వారిపై పూల వర్షం కురిపించన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని భుదావ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. కరోనా వ్యాప్తిని ఆరికట్టేందుకు కేంద్ర విధించిన లాక్‌డౌన్‌లో ఎటువంటి దుర్ఘటనలు జరగకుండ చూసుకొనేందుకు పోలీసులు తీవ్రస్థాయిలో శ్రమపడుతున్నారు. నిరంతరం పాట్రోలింగ్ నిర్వహిస్తూ.. ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారు.
ఇదే క్రమంలో శనివారం కూడా లాక్‌డౌన్ సరిగ్గా అమలు అవుతుందా.. లేదా.. అని పరిశీలించేందుకు రోజూలాగానే పోలీసులు పాట్రోలింగ్‌కి వెళ్లారు. ఎప్పడైతే వాళ్లు ఆ ప్రాంతంలోని ప్రవేశించి నడవటం ప్రారంభించారో.. అప్పటి నుంచి వారిపై పై నుంచి గులాబీ పూల వాన కురవడం ప్రారంభమైంది. ఈ విషయాన్ని భుదావ్ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘‘లాక్‌డౌన్ సమయంలో పోలీసులు బాధ్యతలు నిర్వహిస్తుండగా.. ముస్లింలు వారిపై పూల వాన కురిపించారు’’ అని వాళ్లు పేర్కొన్నారు.
స్థానిక బూత్ ప్రెసిడెంట్ షాబావుద్దీన్, నజ్ముల్‌ల నేతృత్వంలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన స్థానికులు ఈ పని చేశారు అని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది. ‘‘భయంకరమైన అంటువ్యాధి వ్యాపిస్తున్న ఇలాంటి కఠిన సమయంలో వాళ్ల ప్రాణాలను కూడా లెక్క చేయకుండా.. ప్రజలకు భద్రత కల్పిస్తున్న పోలీసులకు మా వందనాలు. మేమంతా పోలీసులకు అండగా ఉన్నాము’’ అని షాబావుద్దీన్ అన్నారు.
Updated Date - 2020-04-05T22:54:38+05:30 IST