ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుపాను ప్రభావంతో వణికిపోయిన ముంబై వాసులు

ABN, First Publish Date - 2020-06-03T22:52:41+05:30

మహారాష్ట్రను నిసర్గ తుపాను అతలాకుతలం చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహారాష్ట్రను నిసర్గ తుపాను అతలాకుతలం చేస్తోంది. గంటకు 120 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో భారీ వృక్షాలు నేలకూలాయి, ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. దీంతో ముంబైతోపాటు చాలా ప్రాంతాల్లో భయానక పరిస్థితి కనిపిస్తోంది. ముంబైకి సమీపంలో ఉన్న నిసర్గ తుపాను క్రమంగా బలహీనపడుతుందని భారత వాతావరణశాఖ తెలిపింది. రాత్రికి ఇది అల్పపీడన ద్రోణిగా మారుతుందని వెల్లడించింది.


తుపాను ప్రభావంతో ముంబై వాసులు వణికిపోయారు. భీకరమైన గాలులతో ఎక్కడికక్కడ చెట్లు నేలకొరిగాయి. ముంబైలో ఓ భవనం పైకప్పు ప్రచండగాలులకు ఎగిరిపోయింది. అటు రాయిగఢ్‌లోని ఓ గోడౌన్ పైకప్పు రేకులు ఎగిరిపోవడంతో అందులో ఉన్న ధాన్యం మొత్తం తడిసిపోయాయి. భారీ వర్షం, గాలుల తీవ్రతతో ముంబైతోపాటు పుణెపై అధికంగా ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. భీకర గాలులు, వర్షం కురుస్తుండడంతో ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్ పోర్టును సాయంత్రం 7 గంటలవరకు మూసివేశారు.  అటు గుజరాత్‌పైనా తుపాను ప్రభావం కనిపిస్తోంది. తీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. ద్వారక దగ్గర సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Updated Date - 2020-06-03T22:52:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising