ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేప్ కేసులో నిందితుడి వింత వాదన.. బెయిల్ తిరస్కరించిన హైకోర్టు

ABN, First Publish Date - 2020-08-15T02:16:48+05:30

13 ఏళ్ల చిన్నారి రేప్ కేసులో నిందితుడికి ముంబై హైకోర్టు బెయిల్ తిరస్కరించింది. నిందితుడు దాఖలుచేసిన బెయిల్ పిటిషన్‌లోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: 13 ఏళ్ల చిన్నారి రేప్ కేసులో నిందితుడికి ముంబై హైకోర్టు బెయిల్ తిరస్కరించింది. నిందితుడు దాఖలుచేసిన బెయిల్ పిటిషన్‌లోని అంశాలను తోసిపుచ్చింది. స్థానికంగా చిన్నారుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఓ ఎన్‌జీవోలో సాగర్ సాహి అనే ఓ డ్రైవర్ పనిచేసేవాడు. అయితే 2015లో అతడు ఓ 13ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడంటూ కేసు నమోదైంది. గతేడాది అతడిని దోషిగా తీర్పు చెప్పిన కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే సాహి ఇటీవల బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. ఇద్దరి అంగీకారంతోనే శృంగారం చేశామని, అది రేప్ కాదని పిటీషన్‌లో పేర్కొన్నాడు. దీనికి ఆధారంగా బాధితురాలి మెడికల్ రిపోర్టులను కోర్టుకు సమర్పించాడు.


బాధితురాలిని బలవంతం చేసినట్లు ఆమె శరీరంపై ఎటువంటి గుర్తులూ లేవని, అందువల్ల దానిని రేప్‌గా పరిగణించవద్దని కోర్టుకు విన్నవించాడు. అయితే దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి సీవీ భడంగ్ అతడి బెయిల్ పిటీషన్‌ను త్రోసిపుచ్చారు. బాధితురాలిపై అత్యాచారం జరిగినప్పుడు ఆమె వయసు 13 సంవత్సరాలని, అందువల్ల ఇద్దరి అంగీకారంతో శృంగారం.. అనే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కారణం వల్ల బెయిల్ పిటీషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.

Updated Date - 2020-08-15T02:16:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising