ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ములాయం నైట్ సఫారీకి ఇచ్చిన భూమిలో యోగి ఫిల్మ్ సిటీ?

ABN, First Publish Date - 2020-09-22T20:53:05+05:30

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ప్రతిష్టాత్మక ఫిల్మ్ సిటీ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మక ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ఎంపికైన మూడు స్థలాల్లో గ్రేటర్ నోయిడాలోని  నైట్ సఫారీ స్థలం చోటు సంపాదించింది. 2005లో ఈ స్థలాన్ని నాటి ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ నైట్ సఫారీ కోసం కేటాయించారు. గౌతమ బుద్ధ యూనివర్సిటీకి సమీపంలోని ముర్షద్‌పూర్ గ్రామంలోని ఈ ప్రాంతాన్నే సీఎం యోగి  ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ఎంపిక చేయనున్నట్టు సమాచారం. దేశంలోనే అతిపెద్దదైన, అత్యంత సుందరమైన ఫిల్మ్ సిటీని నిర్మిస్తామని సీఎం యోగి గతవారంలో ప్రకటించారు. కాగా ఫిల్మ్ సిటీ కోసం ఎంపికైన మిగతా రెండు స్థలాల్లో యమునా ఎక్స్‌ప్రెస్ వే ప్రాంతంలోని సెక్టార్ 21 కూడా ఉంది. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో జెవార్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఈ ప్రాంతం ఉంది. ఇక మరో స్థలం నోయిడాలోని నాలుగు వేర్వేరు సెక్టార్లలో ఉంది. 

Updated Date - 2020-09-22T20:53:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising