ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా రోగుల సాంత్వన కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసిన శివరాజ్ సింగ్ ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-04-26T21:52:06+05:30

కోవిడ్ - 19 బాధితులకు స్వాంతన చేకూర్చడానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏకంగా ఓ ప్రత్యేక శాఖనే ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ : కోవిడ్ - 19 బాధితులకు సాంత్వన చేకూర్చడానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏకంగా ఓ ప్రత్యేక శాఖనే ప్రకటించారు. ‘హ్యాపినెస్ డిపార్ట్‌మెంట్’ (ఆనందాన్ని పంచే శాఖ) పేరుతో ఓ శాఖను ఏర్పాటు చేశారు. కోవిడ్ - 19 బాధితులకు సాంత్వన చేకూర్చడమే ఈ శాఖ పని. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన ‘ఆనంద విభాగ్’ పేరుతో ఓ శాఖను ఏర్పాటు చేశారు. తరువాతి కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో దీన్ని కాస్తా ‘ఆధ్యాత్మిక విభాగం’ లో విలీనం చేసేశారు.


ఈ క్లిష్ట సమయంలో దీనిని కోవిడ్ - 19 కు వ్యతిరేకంగా పోరాడే శాఖకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను తాజాగా ఆదేశించారు. కరోనా సోకిన వారి చుట్టూ ఆనందకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, వారి మానసిక స్థైర్యాన్ని, ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ శాఖను తిరిగి ఏర్పాటు చేసిందని అధికారులు పేర్కొన్నారు.


అయితే ఈ శాఖను ఏర్పాటు చేయడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ స్పందించింది. కోవిడ్ - 19 ను ఎదుర్కోవడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కోవిడ్‌ను ఎదుర్కోవడంలో దృష్టి పెడితే బాగుంటుందని అన్నారు. ఇది పూర్తిగా  పబ్లిసిటీ స్టంట్ అని కాంగ్రెస్ విమర్శించింది. 

Updated Date - 2020-04-26T21:52:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising