ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రిపుల్ తలాఖ్ బాధితురాలికి న్యాయం చేస్తానని సీఎం హామీ

ABN, First Publish Date - 2020-08-22T11:31:01+05:30

ట్రిపుల్ తలాఖ్ బాధితురాలికి న్యాయం చేయాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పోలీసులను ఆదేశించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ (మధ్యప్రదేశ్): ట్రిపుల్ తలాఖ్ బాధితురాలికి న్యాయం చేయాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పోలీసులను ఆదేశించారు. అదనంగా రూ.25లక్షల కట్నం తీసుకురాలేదని బెంగళూరులో నివాసముంటున్న భర్త తన భార్యను ఇంటి నుంచి బయటకు పంపించాడు. దీంతో తన పుట్టిల్లు అయిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరానికి తిరిగివచ్చిన వివాహితకు భర్త వాట్సాప్ కాల్ చేసి త్రిపుల్ తలాఖ్ ఇస్తున్నట్లు చెప్పాడు. భోపాల్ నగరానికి చెందిన ముస్లిమ్ మహిళ (42)కు 2001లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భర్తకు బెంగళూరు నగరంలోని ఓ ప్రముఖ హోటల్ లో ఉద్యోగం లభించడంతో వారి కుటుంబం 2013లో భోపాల్ నుంచి బెంగళూరుకు మారింది.  అదనపు కట్నం తీసుకురమ్మని తన భర్త వేధించడంతోపాటు తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టి, ట్రిపుల్ తలాఖ్ ఇచ్చాడని బాధిత వివాహిత మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీఎం శివరాజ్ సింగ్ మహిళకు న్యాయం చేయాలని డీజీపీని ఆదేశించారు. 

Updated Date - 2020-08-22T11:31:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising