ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ అమర్‌ సింగ్‌ ఇకలేరు

ABN, First Publish Date - 2020-08-02T06:49:48+05:30

రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్‌ సింగ్‌(64) ఇకలేరు. మూత్రపిండాల సమస్యతో ఆర్నెల్లుగా సింగపూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఆగస్టు 1: రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్‌ సింగ్‌(64) ఇకలేరు.  మూత్రపిండాల సమస్యతో ఆర్నెల్లుగా సింగపూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం కన్నుమూశారు. గత మార్చి 2న ఆయన చనిపోయారంటూ వదంతులు రాగా.. ‘టైగర్‌ జిందా హై’ అంటూ వీడియో సందేశాన్ని ట్వీట్‌ చేశారు. కాగా, శనివారం ఉదయం వరకు అమర్‌ సింగ్‌ ట్విటర్‌లో చురుగ్గా ఉన్నారు. స్వాతంత్య్ర సమర యోధుడు, విద్యావేత్త తిలక్‌ వర్థంతి సందర్భంగా నివాళులర్పించారు. బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు.


కింగ్‌ మేకర్‌.. జయప్రద రాజకీయ గురువు

అమర్‌సింగ్‌ 1956 జనవరి 27న యూపీలోని ఆజంగఢ్‌లో జన్మించారు. దేశ రాజకీయాల్లో కింగ్‌ మేకర్‌గా పేరు తెచ్చుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1996లో తొలిసారి రాజ్య సభకు ఎన్నికయ్యారు. ఆపై వరుసగా రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు.  అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌తో విభేదాలు తలెత్తి 2010లో బహిష్కరణకు గురయ్యారు. అనంతరం బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌తో ఓ బ్లాగ్‌ను ఏర్పాటు చేసి, అందులో యాక్టివ్‌గా ఉండేవారు. 2011లో కొంతకాలం జైలు జీవితం అనుభవించారు. ఆపై రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించినా.. అనూహ్యంగా ‘రాష్ట్ర్టీయ లోక్‌ మంచ్‌’ పేరుతో పార్టీని ప్రారంభించారు. 2012 యూపీ ఎన్నికల్లో 360 మంది అభ్యర్థులను నిలబెట్టారు. ఒక్క సీటు కూడా సాధించలేకపోయారు. తర్వాత రాష్ట్రీయ లోక్‌ దళ్‌ తరఫున ఫతేపూర్‌ సిక్రీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2016లో స్వతంత్ర అభ్యర్థిగా.. ఎస్పీ మద్దతుతో ఎంపీగా ఎన్నికయ్యారు. పార్టీలోని ఓ వర్గంతో పాటు.. అప్పటి యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నా.. రాజ్యసభకు వెళ్లగలగడం అమర్‌సింగ్‌ సామర్థ్యానికి నిదర్శనం. అగ్ర నటి జయప్రదకు అమర్‌సింగ్‌ రాజకీయ గురువు. టాలీవుడ్‌, బాలీవుడ్‌లో రాణించిన జయప్రదకు ఢిల్లీలో అమర్‌సింగ్‌తో పరిచయం ఏర్పడింది. ఆయన సూచనలతో ఆమె ఎస్పీలో చేరారు. తదనంతర పరిణామాల్లో అమర్‌సింగ్‌తో పాటే జయప్రద బహిష్కరణకు  గురయ్యారు. అమర్‌సింగ్‌కు నటనలోనూ ప్రవేశముంది. హమారా దిల్‌ ఆప్‌ కే పాస్‌ హై, జేడీ తదితర సినిమాల్లో నటించారు.

Updated Date - 2020-08-02T06:49:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising