ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోటి తలల కరోనా

ABN, First Publish Date - 2020-06-29T07:22:53+05:30

కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య విశ్వవ్యాప్తంగా కోటి దాటేసింది. దాదాపు 5 లక్షల మరణాలు సంభవించాయి. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ లెక్కల ప్రకారం అమెరికాలోనే 25 లక్షల మంది బాధితులు ఉన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కరోనా కేసుల సంఖ్య.. 1,01,69,777 
  • ప్రపంచంలో కోటి దాటిన కేసులు
  • అమెరికాలోనే 25 లక్షల మందికి
  • బ్రెజిల్‌లో విజృంభణ
  • పాక్‌లో 2 లక్షలు దాటి
  • 24 గంటల్లో 20 వేలు!
  • దేశంలో గంటకు 830 మందికి వైరస్‌ 
  • మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ ఆంక్షల పొడిగింపు యోచన
  • కర్ణాటకలో జూలైలో ప్రతి ఆదివారం లాక్‌డౌన్‌
  • గుజరాత్‌ మాజీ సీఎం వాఘేలాకు కొవిడ్‌
  • యాక్టివ్‌ కేసుల కంటే రికవరీలు లక్ష అధికం: కేంద్రం
  • సూరత్‌లో కొవిడ్‌ తాత్కాలిక ఆస్పత్రిలోకి నీరు

వాషింగ్టన్‌, జూన్‌ 28: కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య విశ్వవ్యాప్తంగా కోటి దాటేసింది. దాదాపు 5 లక్షల మరణాలు సంభవించాయి. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ లెక్కల ప్రకారం అమెరికాలోనే 25 లక్షల మంది బాధితులు ఉన్నారు. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇంతకు పది రెట్లు ఎక్కు వగా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. పరీక్షలు చేయించుకోని వారు, వైరస్‌ సోకినా లక్షణాలు కనిపించని వారు చాలామంది ఉంటారని చెబుతున్నారు.


అమెరికాలో గత 24 గంటల్లో 43 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 512 మంది చనిపోయారు. టెక్సాస్‌, ఫ్లోరిడా, ఆరిజోనా, కాలిఫోర్నియాల్లో పాజిటివ్‌లు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో కేసులు పెరుగుతున్నాయి. అమెరికా తర్వాత బ్రెజిల్‌లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఇక్కడ 37వేల మందికి వైరస్‌ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 13 లక్షలు దాటింది. రష్యాలో కొత్తగా 6,791 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.


పాకిస్థాన్‌లో మరో 4,072 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య 2,02,955కి చేరుకుంది. వైరస్‌ అదుపులోకి వచ్చిందని భావిస్తున్న చైనా, న్యూజిలాండ్‌, ఆస్ర్టేలియాల్లో కూడా మళ్లీ కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. కాగా, కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకునేందు ప్రపంచవ్యాప్తంగా నేతలు, స్టార్లు ఏకమయ్యారు. వీఐపీలు, స్టార్లతో కలిసి ప్రముఖ హీరో డ్వేన్‌ జాన్సన్‌ నిర్వహించిన వర్చువల్‌ కచేరీ ద్వారా నగదు, బ్యాంకు రుణ హామీల రూపంలో రూ. 53వేల కోట్లు సమీకరించారు. కరోనాకు వైరస్‌ అందుబాటులోకి రాగానే పేద దేశాలకు 25 కోట్ల డోసులు పంపించే ఏర్పాట్లు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.


Updated Date - 2020-06-29T07:22:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising