ప్రపంచవ్యాప్తంగా 89 లక్షలు దాటిన కరోనా కేసులు
ABN, First Publish Date - 2020-06-21T18:24:55+05:30
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభన కొనసాగుతోంది. దీంతో ప్రపంచ దేశాలు...
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభన కొనసాగుతోంది. దీంతో ప్రపంచ దేశాలు వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. వైరస్ బాధితుల సంఖ్య 90 లక్షలకు చేరువలో ఉంది. 4 లక్షల 66 వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 89,15,866 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 4,66,728 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి 47,38,608 మంది కోలుకున్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 23,30,578 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,21,980 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 9,72,941 మంది కోలుకున్నారు. మరిన్ని వివరాలకు పై వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2020-06-21T18:24:55+05:30 IST