ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోమ్ ఐసోలేషన్‌లో కోలుకున్న 50శాతం కరోనా బాధితులు!

ABN, First Publish Date - 2020-09-26T12:47:17+05:30

దేశరాజధాని ఢిల్లీలో కరోనా నుంచి కోలుకుంటున్నవారిలో 50 శాతం మంది హోమ్ ఐసోలేషన్‌లోనే రికవరీ అయ్యారని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. దీని ప్రకారం మే మొదటివారం నుంచి సెప్టెంబరు 23 వరకూ ఢిల్లీలో 1,34,133 మందిలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా నుంచి కోలుకుంటున్నవారిలో 50 శాతం మంది హోమ్ ఐసోలేషన్‌లోనే రికవరీ అయ్యారని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. దీని ప్రకారం మే మొదటివారం నుంచి సెప్టెంబరు 23 వరకూ ఢిల్లీలో 1,34,133 మందిలో స్వల్ప కరోనా లక్షణాలు కనిపించాయి. వీరిలో 1,13,374 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ నేపధ్యంలో ఈ బాధితుల విషయంలో కోవిడ్ ప్రోటోకాల్ అమలు చేశారు.


ఢిల్లీ ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం ఢిల్లీలో కరోనా నుంచి కోలుకున్నవారిలో 50 శాతం మంది హోమ్ ఐసోలేషన్‌లోనే చికిత్స పొందారు. కాగా ఢిల్లీ మహానగరంలో మొత్తం 2,62,450 కరోనా కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 30,867 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలో కొత్తగా 3,827 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా 24 మంది మృతి చెందారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5,147కు చేరింది.


Updated Date - 2020-09-26T12:47:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising