ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో 44వేల కేసులు

ABN, First Publish Date - 2020-07-07T07:59:57+05:30

కరోనా ధాటికి అమెరికా విలవిల్లాడుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 46,603 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అగ్రరాజ్యంలో మొత్తం బాధితుల సంఖ్య 30 లక్షలకు చేరువైంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, జూలై 6: కరోనా ధాటికి అమెరికా విలవిల్లాడుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 46,603 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అగ్రరాజ్యంలో మొత్తం బాధితుల సంఖ్య 30 లక్షలకు చేరువైంది. కరోనా కారణంగా ఇప్పటివరకు 1.32 లక్షల మంది చనిపోయారు. అమెరికా హౌస్‌ స్పీకర్‌ ఫిలిప్‌ గన్‌కు కూడా పాజిటివ్‌గా తేలింది. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ విలయం కొనసాగుతూనే ఉంది. బ్రెజిల్‌లో 24 గంటల్లో 33,514 కేసులు వెలుగుచూడగా, 737 మంది మృత్యువాతపడ్డారు. రష్యాలో కొత్తగా 22,332 మందికి వైరస్‌ సోకింది. దక్షిణాఫ్రికాలో 8,773 మందికి వైరస్‌ సోకగా మొత్తం బాధితుల సంఖ్య 1,96,750కి పెరిగింది. సౌతాఫ్రికన్‌ హిందూ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు జయ్‌రాజ్‌ బచ్చు (75)కి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ ఆఫ్రికా దేశాలు లాక్‌డౌన్‌ను సడలిస్తున్నాయి. భారత్‌ నుంచి వచ్చిన ఐదుగురికి పాజిటివ్‌గా తేలిందని సింగపూర్‌ ప్రకటించింది. ఈజిప్టు ప్రభుత్వం అక్కడి వైద్యులపై సీరియ్‌సగా ఉంది. కొవిడ్‌ నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినందుకు 10 మంది వైద్యులు, ఆరుగురు జర్నలిస్టులను అరెస్టు చేసింది. ఈ దేశంలో ఇప్పటివరకు 75 వేల మందికిపైగా వైరస్‌ సోకింది. ఆస్ర్టేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో కేసులు పెరుగుదలతో వందేళ్ల తర్వాత తొలిసారిగా సరిహద్దులు మూసేశారు. పాకిస్థాన్‌లో కొత్తగా 3,344 కేసులు బయటపడ్డాయి. ఆరోగ్యశాఖ మంత్రి జాఫర్‌ మీర్జాకు పాజిటివ్‌ వచ్చింది. ఫిలిప్పీన్స్‌లో కొత్తగా 2 వేలకుపైనే కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 44 వేలు దాటింది.


Updated Date - 2020-07-07T07:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising