ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్రలో కరోనా కల్లోలం.. 24 గంటల్లో 3000కు పైగా పాజటివ్ కేసులు

ABN, First Publish Date - 2020-05-25T01:46:45+05:30

మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఒక్కరోజులో 3000కు పైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఒక్కరోజులో 3000కు పైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసులతో పాటు ప్రతిరోజూ నమోదవతున్న కేసుల్లో సగభాగం కేవలం మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. కొత్తగా నమోదైన కేసులకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక దీనికి ఆధారంగా నిలుస్తోంది. దాని ప్రకారం గత 24  గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,041 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 58 మంది మరణించారు.


కాగా 1,196 మంది నేడు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 50,231కి చేరింది. 1,635 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు 14,600 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 33,988 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-05-25T01:46:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising