ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్ర పోలీసులపై కరోనా దెబ్బ!

ABN, First Publish Date - 2020-04-26T22:27:51+05:30

కరోనా తుఫానులో పడి మహారాష్ట్రా అతలాకుతమవుతోంది. దీంతో కరోనా యుద్ధంలో ముందుండి పోరాడుతున్న పోలీసులపై కూడా కరోనా ప్రభావం పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కరోనా తుఫానులో పడి మహారాష్ట్రా అతలాకుతమవుతోంది. దీంతో అక్కడి పోలీసులపై కూడా కరోనా ప్రభావం పడింది. ఇప్పటికే అక్కడ 100 మందికి పైగా పోలీసులు కరోనా బారినపడ్డట్టు అధికారులు చెబుతున్నారు. ఈ మహమ్మారి ఇద్దరు పోలీసులను పొట్టనపెట్టుకోవడంతో డిపార్ట్‌మెంట్ అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ‘కరోనా వైరస్‌తో పోరాడుతూ ఇద్దరు పోలీసులు మృతి చెందారని చెప్పటానికి చింతిస్తున్నాము. ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకుంటుంది’ అని మహారాష్ట్రా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఈ రోజు మధ్యహ్నం వీడియో కాన్ఫరెన్సులో తెలిపారు.


తాజా లెక్కల ప్రకారం మహా పోలీసు డిపార్ట్‌మెంటులో మొత్తం 107 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏడుగురు పోలీసులు వ్యాధి నుంచి బయటపడ్డారు. కరోనాకు బలైన చంద్రకాంత్ గన్‌పత్ పెందుర్కర్(57) , సందీప్ సుర్వేలకు(52) పోలీసులు నివాళులర్పించారు. ‘కరోనాతో పోరాడుతూ ఇద్దరు పోలీసు వీరులు నెలకొరిగారు. వారికి నివాళులర్పిస్తూ.. ఈ రోజు మేము ఎటువంటి ట్వీట్స్ చేయము..రెస్పాన్సులు మాత్రమే పోస్ట్ చేస్తాము’ అని పోలీసు శాఖ ట్వీట్ చేసింది. మరోవైపు.. నవీ ముంబైకి చెందిన ఓ పోలీసు కరోనా బారిన పడటంతో ఆయన భార్యకు కూడా ఈ వ్యాధి సోకింది. దీంతో ఆమె మృతి చెందారు. వారి కూతురికి కోసం వ్యాధి సోకినట్టు సమాచారం. కరోనాతో ముందుండి పోరాడాల్సి వారే దీనితో సతమతమవుతుండటంతో ప్రభుత్వం మరిన్ని పటిష్ట చర్యల దిశగా అడుగులు వేస్తోంది. 

Updated Date - 2020-04-26T22:27:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising