ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీ ఎలెర్ట్: దేశంలో 12కు పెరిగిన కరోనా మృతుల సంఖ్య

ABN, First Publish Date - 2020-03-25T00:35:52+05:30

కరోనా మహమ్మారి దేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 500కు పైగా కరోనా నిర్ధారిత కేసులు నమోదు కాగా, 12 మంది మృతి చెందారు. ఈ ఉదయం హోం మంత్రిత్వ శాఖ వెల్లడించిన డేటా ప్రకారం కోవిడ్-19 కేసులు 492కు పెరగ్గా అందులో 446 యాక్టివ్ కేసులు. ఇందులో 41 మంది విదేశీయులు ఉన్నారు. అలాగే, 11 మంది మృతి చెందినట్టు హోంశాఖ తెలిపింది. కాగా, సాయంత్రానికి ఈ సంఖ్య 12కు పెరిగింది. కేసుల సంఖ్య 529కి చేరుకుంది. కోలుకున్న బాధితుల సంఖ్య 53గా ఉంది.  


తాజా మరణం మహారాష్ట్రలో సంభవించింది. ఈ నెల 15న యూఏఈ నుంచి ముంబై వచ్చిన 65 ఏళ్ల వృద్ధుడు అహ్మదాబాద్ వెళ్లి 20న తిరిగి ముంబై వచ్చాడు. కోవిడ్ లక్షణాలతో కస్తూర్బా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. అతడికి రక్తపోటు, మధుమేహం కూడా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. తాజా మృతితో ముంబైలో మృతి చెందిన వారి సంఖ్య 5కు చేరింది.

Updated Date - 2020-03-25T00:35:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising