ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేడియేషన్‌కు అడ్డా మన చందమామ

ABN, First Publish Date - 2020-09-27T08:34:02+05:30

కేన్సర్‌ సహా.. పలు రుగ్మతలకు కారణమయ్యే రేడియేషన్‌ చంద్రుడి ఉపరితలంపై తీవ్ర స్థాయిలో ఉందని చైనా ల్యాండర్‌ పంపిన డేటా స్పష్టం చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • భూమికంటే.. 200-1,000 రెట్లు అధికం

వాషింగ్టన్‌, సెప్టెంబరు 26: కేన్సర్‌ సహా.. పలు రుగ్మతలకు కారణమయ్యే రేడియేషన్‌ చంద్రుడి ఉపరితలంపై తీవ్ర స్థాయిలో ఉందని చైనా ల్యాండర్‌ పంపిన డేటా స్పష్టం చేసింది. ఈ వివరాలను అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాల శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఆ అధ్యయనాన్ని యూఎస్‌ జర్నల్‌ ‘సైన్స్‌ అడ్వాన్సె్‌స’లో ప్రచురించారు. దాని ప్రకారం.. చైనాకు చెందిన ల్యాండర్‌ ‘చాంగ్‌-ఈ 4’ చంద్రుడిపైన రేడియేషన్‌ వివరాలను సేకరించింది. మనకు కనిపించే చందమామ ఆవలివైపున ధ్రువప్రాంతంలో పలు ప్రాంతాల్లో రేడియేషన్‌ స్థాయులను నిమిషం, పది నిమిషాలు, 60 నిమిషాల వారీగా కొలిచింది. చంద్రుడి ఉపరితలంపై రేడియేషన్‌ గంటకు 60 మైక్రోసీవెర్ట్స్‌ ఉన్నట్లు గుర్తించింది. భూమితో పోలిస్తే.. ఇది 200 నుంచి 1,000 రెట్లు అధికం. అంతటి రేడియేషన్‌ను మానవ శరీరాలు తట్టుకోలేవని జర్మనీ అంతరిక్ష కేంద్రానికి(డీఎల్‌ఆర్‌) చెందిన రేడియేషన్‌ ఫిజిస్ట్‌ థామస్‌ బెర్గెర్‌, క్రిస్టియన్‌-అల్‌బ్రెట్చ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన రాబర్ట్‌ విమ్మర్‌ వెల్లడించారు. 


Updated Date - 2020-09-27T08:34:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising