రష్యా ప్రజలకు మోదీ శుభాకాంక్షలు
ABN, First Publish Date - 2020-05-09T22:48:16+05:30
రష్యా విజయ దినోత్సవాన్ని (విక్టరీ డే) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. అంతే కాకుండా రష్యాతో గల అనుబంధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం నాటి సంగతులు తలుచుకన్న ప్రధాని
న్యూఢిల్లీ: రష్యా విజయ దినోత్సవాన్ని (విక్టరీ డే) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. అంతే కాకుండా రష్యాతో గల అనుబంధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం నాటి సంగతులు తలుచుకన్న ప్రధాని, ఆ యుద్ధంలో భారతీయ సైనికుల త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. వారి త్యాగాలను ప్రశంసించారు. ట్విట్టర్ ద్వారా మోదీ ఈ విషయాన్ని తెలియజేశారు.
‘‘విక్టరీ డే 75వ వార్షికోత్సవం సందర్భంగా ఆ నాటి గంభీరమైన జ్ఞాపకాల్ని రష్యాతో పాటు గుర్తు చేసుకుంటున్నాం. మేం మరోసారి స్పష్టం చేస్తున్నాం. రష్యాతో ఇండియా అనుబంధం కొనసాగుతుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో వేలాది మంది భారత సైనికులు ప్రాణ త్యాగాలు చేశారు. రష్యా అధ్యక్షుడితో పాటు ఆ దేశ ప్రజలకు ఈ విజయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు’’ అని మోదీ ట్వీట్ చేశారు.
1945లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అప్పటి సోవియట్ యూనియన్ రష్యాకు జర్మనీ ఈరోజే లొంగిపోయింది. వాస్తవానికి ఇది జరిగింది. మే 8 అర్థరాత్రి. అయితే అప్పటికే 9వ తేదీ మారినందున ఆ రోజునే విజయ దినోత్సవం (విక్టరీ డే)గా జరుపుకుంటున్నారు.
Updated Date - 2020-05-09T22:48:16+05:30 IST