ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిత్రులకు సహాయం చేయడానికి భారత్ సదా సిద్ధమే : మోదీ

ABN, First Publish Date - 2020-04-10T18:39:32+05:30

మిత్ర దేశాలకు వీలైనంత సాయం చేయడానికి భారత్ సదా సిద్ధంగానే ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మిత్ర దేశాలకు వీలైనంత సాయం చేయడానికి భారత్ సదా సిద్ధంగానే ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఉత్పత్తి చేసే పదార్థాలతో పాటు మరికొన్న ప్రాణాధార ఔషధాలను భారత్ ఇజ్రాయిల్‌కు పంపినందుకు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంలో ప్రధాని మోదీ పై విధంగా స్పందించారు.


‘‘కరోనా మహమ్మారిపై ఇద్దరం కలిసి పోరాడాల్సిన సందర్భం. మిత్రులకు ఏ రకమైన సహాయం చేయాలన్నా భారత్ సదా సిద్ధంగానే ఉంది. ఇజ్రాయిల్ ప్రజలు మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని మోదీ శుక్రవారం ట్వీట్ చేశారు.


ఇక, ఇదే వరుసలో బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో కూడా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మోదీ ప్రతిస్పందనగా ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ధన్యవాదాలు ప్రెసిడెంట్.... ఈ క్లిష్ట సమయంలో భారత్ - బ్రెజిల్ భాగస్వామ్యం గతంలో కంటే చాలా బలంగా ఉంది. ఈ కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రపంచ దేశాలతో కలిసి పోరడడానికి భారత్ సిద్ధంగా ఉంది’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-04-10T18:39:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising