ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో వరదల పరిస్థితిని సమీక్షించిన మోదీ

ABN, First Publish Date - 2020-08-10T22:09:52+05:30

దేశంలోని వరదల పరిస్థితిపై ప్రధాని మోదీ సోమవారంనాడు సమీక్షించారు. వరద బాధిత రాష్ట్రాల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలోని వరదల పరిస్థితిపై ప్రధాని మోదీ సోమవారంనాడు సమీక్షించారు. వరద బాధిత రాష్ట్రాల మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌‌లో మాట్లాడారు.


కేరళ తరఫున ముఖ్యమంత్రి ఎం.పినరయి విజయన్, రెవెన్యూ మంత్రి ఇ.చంద్రశేఖరన్, ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ, చీఫ్ సెక్రటరీ డాక్టర్ విశ్వాస్ మెహతా, డీజీపీ లోక్‌నాథ్ బెహరా ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారీ వర్షాల కారణంగా అళపుజ జిల్లా కుట్టనాడ్ తాలూకాలోని లోతట్టు ప్రాంతాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ఇడుక్కిలో  కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య 48కి చేరింది.


కర్ణాటక నుంచి ఆ రాష్ట్ర హోం మంత్రి బసవరాజ్ బొమ్మై, రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కావేరీ నదీ జల మట్టం అంతకంతకూ పెరుగుతుండటంతో ఆ పరిసర ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా ముందుజాగ్రత్త హెచ్చరికలు జారీ చేసినట్టు మాండ్ల జిల్లా డిప్యూటీ కమిషనర్ ఎంవీ వెంకటేష్ సోమవారంనాడు మీడియాకు తెలిపారు. ఎడతెగని వర్షాలతో కర్ణాటకలోని పలు ప్రాంతాలు వరదల పరిస్థితిని తలపిస్తున్నాయి.


బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం ప్రభుత్వాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఆగస్టు 6న బీహార్‌లోని పలు జిల్లాల్లో వరద తరహా పరిస్థితి నెలకొనడంతో ఎన్‌డీఆర్, ఎస్‌డీఆర్ఎఫ్ సహా సుమారు 30 టీమ్‌లను రంగంలోకి దింపారు. 16కు పైగా జిల్లాల్లో వరద నీటి మట్టం పెరుగుతోంది.

Updated Date - 2020-08-10T22:09:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising