చైనాకు చెక్: సుఖోయ్, మిగ్ యుద్ధ విమానాల కొనుగోలుకు మోదీ సై
ABN, First Publish Date - 2020-06-18T23:00:50+05:30
న్యూఢిల్లీ: చైనాతో ఉద్రిక్తతల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సుఖోయ్, మిగ్ యుద్ధ విమానాల కొనుగోలు చేయాలని మోదీ సర్కారు నిర్ణయించింది.
న్యూఢిల్లీ: చైనాతో ఉద్రిక్తతల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సుఖోయ్, మిగ్ యుద్ధ విమానాల కొనుగోలు చేయాలని మోదీ సర్కారు నిర్ణయించింది. దీనికి సంబంధించి రక్షణ శాఖ నుంచి ఎయిర్‌ఫోర్స్‌కు ఆదేశాలు అందాయి. 12 సుఖోయ్, 21 మిగ్-29 యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని ఆదేశాల సారాంశం.
లడక్ గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు చనిపోవడంతో కేంద్రం యుద్ధ విమానాల కొనుగోలుపై నిర్ణయం తీసుకుంది. ఓ పక్క చర్చలు జరుపుతుండగానే ఈ నెల 15న చైనా బలగాలు వాస్తవాధీన రేఖ దాటి వచ్చేందుకు యత్నించాయి. అడ్డుకున్న భారత జవాన్లపై చైనా బలగాలు పాశవికంగా దాడి చేసి చంపేశాయి. ఘటనను తీవ్రంగా తీసుకున్న కేంద్రం సైనికుల బలిదానాలను వృధా కానీయబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. చైనాకు గట్టి గుణపాఠం చెప్పాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా చైనాకు బుద్ది వచ్చేలా గట్టి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. రేపటి అఖిల పక్ష సమావేశంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగా చైనాపై చర్యలుంటాయని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే త్రివిధ దళాలను అప్రమత్తం చేశారు.
Updated Date - 2020-06-18T23:00:50+05:30 IST