ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యులు తెల్లకోట్లు వేసుకున్న దేవుళ్లు: ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2020-03-26T00:18:57+05:30

తన సొంత నియోజకవర్గం వారణాసి ప్రజలతో ఇవాళ జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైద్యులకు చికిత్స అందిస్తున్న వైద్యులు ‘‘తెల్లకోట్లు వేసుకున్న దేవుళ్లు’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ప్రాణాంతక మహమ్మారితో పోరాడుతున్న వారిని వేధించడం సిగ్గుచేటు అని తీవ్ర స్వరంతో పేర్కొన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బందితో కొందరు ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. ఈ వార్తలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. తన సొంత నియోజకవర్గం వారణాసి ప్రజలతో ఇవాళ జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..


‘‘ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది ఇవాళ మనకు దేవుళ్లతో సమానం. ఓ మహమ్మారి నుంచి వాళ్లు మనల్ని కాపాడుతున్నారు. మనల్ని కాపాడడం కోసం వాళ్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు..’’ అని ప్రధాని పేర్కొన్నారు. వైద్య సిబ్బందితో ఎవరైనా అమర్యాదగా ప్రవర్తించినట్టు తెలిస్తే... అలా ప్రవర్తించేవాళ్లు తప్పుచేస్తున్నారని అర్థమయ్యేలా చెప్పాలంటూ ప్రజలను కోరారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మనకు సేవ చేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి సహకరించని వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే హోంశాఖను ఆదేశించినట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. 

Updated Date - 2020-03-26T00:18:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising