ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శభాష్‌ హుస్సేన్‌!

ABN, First Publish Date - 2020-02-20T08:54:43+05:30

ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరుగుతున్న ‘హునర్‌ హాట్‌’ మేళాలో ప్రధాని మోదీ కాసేపు సరదాగా తిరిగారు. కేబినెట్‌ సమావేశం ముగిసిన వెంటనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోదీ మనసు దోచిన 

నెల్లూరు హస్త కళాకారుడు

ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో  జరుగుతున్న ‘హునర్‌ హాట్‌’ మేళాలో ప్రధాని మోదీ కాసేపు సరదాగా తిరిగారు. కేబినెట్‌ సమావేశం ముగిసిన వెంటనే మోదీ నేరుగా మేళాకు వెళ్లారు. దాదాపు 50 నిమిషాలు అక్కడ సరదాగా గడిపారు. దుకాణాలన్నీ కలియతిరిగారు. లిట్టి చోఖా తిని రూ.120 చెల్లించారు. నులక మంచం, వెదురు కుర్చీలపై కొంత సేపు సేదతీరారు. 




మోదీ మనసు దోచిన నెల్లూరు హస్త కళాకారుడు

న్యూఢిల్లీ: హస్తకళా నైపుణ్యంతో తెలుగోడు తయారు చేసిన వస్తువులు భారత ప్రధాని మోదీ మనసు దోచుకున్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన హస్తకళాకారుడు షేక్‌ జకీర్‌ హుస్సేన్‌ పనితనాన్ని మోదీ అభినందించారు. ఢిల్లీలోని రాజ్‌పథ్‌ వద్ద ఏర్పాటు చేసిన ‘హునార్‌ హాట్‌’ హస్తకళా ప్రదర్శన ఇందుకు వేదికైంది. ఈసందర్భంగా హుస్సేన్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి పని విధానం, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇది తమ అదృష్టంగా భావిస్తున్నామని హుస్సేన్‌ అన్నారు.  కాగా, హస్తకళా వేదికను సందర్శించిన మోదీ.. అక్కడి ఓపెన్‌ హోటల్‌ ఎదుట వేసిన నులక మంచంపై కూర్చుని ఉత్తరాది చిరుతిండి ‘లిట్టి చోఖా’ తిన్నారు. వెదురు కుర్చీలో కూర్చుని ‘కుల్హాద్‌ చాయ్‌’ (మట్టి కప్పులో ఇచ్చే టీ) తాగారు. బిల్లును కూడా మోదీనే స్వయంగా చెల్లించారు. ’

Updated Date - 2020-02-20T08:54:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising