ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోడెర్నా, ఫైజర్... కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ బ్లూప్రింట్ విడుదల...

ABN, First Publish Date - 2020-09-18T22:12:50+05:30

అమెరికాకు చెందిన మోడెర్నా, ఫైజర్ కంపెనీలు కూడా వ్యాక్సిన్ తయారీలో పురోగాభివృద్ధి సాధించాయి. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశాయి. ఇందుకు సంబంధించిన బ్లూప్రింట్ కూడా విడుదల చేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ : అమెరికాకు చెందిన మోడెర్నా, ఫైజర్ కంపెనీలు కూడా వ్యాక్సిన్ తయారీలో పురోభివృద్ధి సాధించాయి. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశాయి. ఇందుకు సంబంధించిన బ్లూప్రింట్ కూడా విడుదల చేశాయి.


ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి విముక్తి కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. కరోనాను తరిమేసే క్రమంలో... వ్యాక్సిన్ తయారీ కోసం ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. రష్యా ఒకడుగు ముందుకేసి వ్యాక్సిన్ ను ఇప్పటికే మార్కెట్ లోకి విడుదల చేసింది. తాజాగా అమెరికాకు చెందిన మోడెర్నా, ఫైజర్ కంపెనీలు కూడా వ్యాక్సిన్ తయారీలో పురోభివృద్ధి సాధించాయి. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశాయి కూడా. ఇందుకు సంబంధించి ఓ బ్లూప్రింట్ ను కూడా విడుదల చేశాయి.



కాగా... మొత్తం 135 పేజీల సమాచారాన్ని కంపెనీలు విడుదల చేశాయి. వ్యాక్సిన్ ట్రయల్స్ లో పాల్గొనే వలంటీర్ల ఎంపిక విధానం, వారి వివరాలను రహాస్యంగా ఉంచాలని నిర్ణయించారు. ప్రయోగాల అనంతరం వారి పర్యవేక్షణ, ప్రయోగాల్లో సమస్యలు తలెత్తితే అనుసరించాల్సిన విధానాలపై ఈ బ్లూప్రింట్ లో ప్రస్తావించారు. ఈ ప్రయోగాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సంస్థలు గోప్యంగా ఉంచుతున్నాయి.


క్లినికల్ ట్రయల్స్ ప్రయోగాలు పూర్తైయ్యాక మాత్రమే వాటిని విడుదల చేయాలని భావిస్తున్నాయి. ప్రయోగాల్లో ఏమైనా తేడాలు వస్తే తీసుకోవల్సిన జాగ్రత్తలపై కూడా బ్లూప్రింట్ లో వివరించారు. కాగా... వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న తొమ్మిది కంపెనీల్లో రెండు కంపెనీలు మాత్రమే బ్లూప్రింట్ ను విడుదల చేశాయి.


అయితే... కరోనా నివారణకు తయారు చేస్తున్న వ్యాక్సిన్ కు సంబంధించి పూర్తి ప్రయోగాల ఫలితాలను విశ్లేషించడానికి మరింత సమయం పట్టే అవకాశముందని మోడెర్నా, ఫైజర్ కంపెనీలు పేర్కొన్నాయి. ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావాలని  ఈ సంస్థలు భావిస్తున్నాయి.


కాగా... మోడెర్నా 30 వేల మందిపై ప్రయోగాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే 25 వేల మందిపై ప్రయోగాలు పూర్తి చేసినట్టుగా ఆ కంపెనీ ప్రకటించింది. ఇక... ఫైజర్ సంస్థ 44 వేల మందిపై క్రినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. 

Updated Date - 2020-09-18T22:12:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising