ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసుప‌త్రి నిర్వాకం: వేరే కుటుంబానికి కోవిడ్‌-19 బాధితుని మృత‌దేహం అప్ప‌గింత‌!

ABN, First Publish Date - 2020-07-08T11:38:51+05:30

మహారాష్ట్రలోని ఠాణె నగరంలో కొద్ది రోజుల క్రితం అదృశ్య‌మైన‌‌ కోవిడ్ -19 బాధితుని గురించిన స‌మాచారం ఆల‌స్యంగా వెలుగుచూసింది. ఆ బాధితుని మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది మరొక కుటుంబానికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఠాణె: మహారాష్ట్రలోని ఠాణె నగరంలో కొద్ది రోజుల క్రితం అదృశ్య‌మైన‌‌ కోవిడ్ -19 బాధితుని గురించిన స‌మాచారం ఆల‌స్యంగా వెలుగుచూసింది. ఆ బాధితుని మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది మరొక కుటుంబానికి అప్పగించినట్లు తే‌లింది. ఆసుపత్రి సిబ్బంది నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఈ  ఘ‌ట‌న జ‌రిగింద‌ని భావిస్తున్నారు. ఆసుపత్రి నుంచి 72 ఏళ్ల క‌రోనా బాధితుడు అదృశ్య‌మైన నేప‌ధ్యంలో అత‌ని కుటుంబీకులు కపూర్బావాడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని, ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆ బాధితుణ్ణి అత‌ని కుటుంబీకులు జూన్ 29 న గ్లోబల్ హబ్ కోవిడ్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అతని మృత‌దేహాన్ని రెండు రోజుల క్రితం కోప్రిలోని ఒక కుటుంబానికి ఆసుప‌త్రి సిబ్బంది అప్పగించినట్లు పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. దీంతో వారు ఆ మృత‌దేహానికి వెంట‌నే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. కాగా ఆసుప‌త్రి సిబ్బంది తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ఇద్దరు బాధితుల చికిత్స‌కు సంబంధించిన రిపోర్టులు తారుమారైన‌ కార‌ణంగా ఈ గంద‌ర‌గోళం చోటుచేసుకుంది.  

Updated Date - 2020-07-08T11:38:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising