ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రగ్యా ‘మిస్సింగ్’ అంటూ పోస్టర్లు.. ఆస్పత్రిలో ఉన్నానన్న ఎంపీ!

ABN, First Publish Date - 2020-05-30T00:48:13+05:30

కొవిడ్-19 కల్లోలం మధ్య ప్రజలు అవస్తలు పడుతున్న నేపథ్యంలో తమ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాగూర్ జాడ లేకుండా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: కొవిడ్-19 సంక్షోభంలో ఓ వైపు ప్రజలు అవస్తలు పడుతుండగా తమ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాగూర్ మాత్రం ‘‘కనిపించకుండా పోయారంటూ’’ మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఇవాళ పోస్టర్లు వెలిశాయి. వీడియో కాల్ ద్వారా ఆమె ఓ మొబైల్ ఆస్పత్రి సేవలను ప్రారంభించినప్పటికీ ఈ వివాదం సద్దుమణగ లేదు. దీంతో బీజేపీ ప్రతినిధి ఉమాకాంత్ దీక్షిత్ మీడియా ముందుకు వచ్చి వివరాలు వెల్లడించారు. ఆమె ‘‘మిస్సింగ్’’లో లేరనీ.. కేన్సర్, కంటి చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారని ఆయన వెల్లడించారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో ఉన్పప్పటికీ ఫోన్ ద్వారా వలస కార్మికుల సమస్యలపై ఆమె స్పందించారనీ.. వలస కూలీలు, విద్యార్ధులు సహా అవసరతలో ఉన్నవారందరికీ సాయం అందేలా చూశారని దీక్షిత్ పేర్కొన్నారు.


ఇదే వ్యవహారంపై రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రాహుల్ కొఠారీ సైతం స్పందించారు. తాను ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరినట్టు ఇప్పటికే ఎంపీ వెల్లడించారని ఆయన పేర్కొన్నారు. మరోవైపు భోపాల్ సౌత్‌వెస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీసీ శర్మ ప్రగ్యా ‘‘మిస్సింగ్’’  పోస్టర్లకు మద్దతు ఇచ్చారు. ప్రస్తుతం సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఆమె ఎక్కడున్నారంటూ ప్రజలు అడగడంలో తప్పులేదని ఆయన చెప్పుకొచ్చారు. 

Updated Date - 2020-05-30T00:48:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising