ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా వ్యాఖ్యలు వేరు: ‘టూ మచ్ డెమొక్రసీ’పై అమితాబ్

ABN, First Publish Date - 2020-12-11T22:34:06+05:30

నేను చెప్పిన విషయం నాకు ఆపాదించిన విషయం రెండు వేరువేరుగా ఉన్నాయి. నేను చేసిన వ్యాఖ్యలు చైనా మోడల్‌కు అద్దం పడుతుంది. చైనాతో పోల్చుకున్నప్పుడు ఇండియాలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంది. మనకు ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉందనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఇండియాలో మితిమీరిన ప్రజాస్వామ్యం (టూ మచ్ ఆఫ్ ఏ డెమొక్రసీ) ఉందంటూ నీతి అయోగ్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సీఈవో) అమితాబ్ కాంత్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదస్పదమయ్యాయి. ఈ విషయమై దేశ వ్యాప్తంగా విమర్శలు రావడంతో తన వ్యాఖ్యలు మరో రకంగా అర్థం చేసుకున్నారని ఆయన వివరణ ఇచ్చుకొచ్చారు. చైనాతో పోల్చుకుంటే ఇండియాలో చాలా ఎక్కువ ప్రజాస్వామ్యం ఉందని అన్న ఆయన ఇండియాకు ప్రజాస్వామ్యం జీవనాడి లాంటిదని తన వ్యాఖ్యల్ని సవరించుకున్నారు.


‘‘నేను చెప్పిన విషయం నాకు ఆపాదించిన విషయం రెండు వేరువేరుగా ఉన్నాయి. నేను చేసిన వ్యాఖ్యలు చైనా మోడల్‌కు అద్దం పడుతుంది. చైనాతో పోల్చుకున్నప్పుడు ఇండియాలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంది. మనకు ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉందనే విషయం ఉందనే విషయాన్ని మనం చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. ఇండియాకు ప్రజాస్వామ్యం అనేది జీవనాడి లాంటిది. మన ప్రజాస్వామ్యం సమతూకంగా ఉంటుంది. రెండు సభల విధానం, దేశంలోని ప్రతి పౌరుడికి తన గొంతును వినిపించే హక్కు లాంటివి ఉండడం మనందరం గర్వించదగ్గ ప్రజాస్వామ్యం’’ అని అమితాబ్ కాంత్ అన్నారు.


భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉందని, కఠినమైన సంస్కరణలను అమలు చేయడం ఇక్కడ కష్టసాధ్యంగా మారిందని అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. అయితే, చైనా వంటి దేశాలకు పోటీ ఇచ్చేందుకు మరిన్ని కఠిన సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మైనింగ్, బొగ్గు, కార్మిక, వ్యవసాయం సహా అన్ని రంగాల్లో కేంద్రం కఠిన సంస్కరణలను అమలు చేసిందని, ఆ తర్వాతి దశ సంస్కరణలను రాష్ట్రాలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అమితాబ్ కాంత్ స్పస్టం చేశారు.

Updated Date - 2020-12-11T22:34:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising