ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్ తీసుకున్న మంత్రికి కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2020-12-05T19:15:59+05:30

కరోనా వ్యాక్సిన్ తయారై మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నాయి. భారత్ కూడా కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. అందులో భారతీ బయోటెక్‌కు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీఘర్: కరోనా వ్యాక్సిన్ తయారై మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది.  ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నాయి. భారత్ కూడా కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. అందులో భారతీ బయోటెక్‌కు చెందిన కొవాక్సిన్ ఫైనల్ ట్రయల్స్‌లో ఉంది. అయితే ఇప్పుడు ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి ఓ సంచలన విషయం బయటపడింది.కొద్ది వారాల క్రితం హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ కూడా ఈ ట్రయల్స్‌లో పాల్గొన్నారట. అయితే వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది రోజుల తరువాత ఆయనకు కరోనా సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.


‘ఇటీవల నేను కొవ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొన్నాను. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కొద్ది వారాలకు కరోనా టెస్ట్ చేయించుకుంటే అందులో పాజిటివ్ వచ్చింది’ అని అనిల్ విజ్ తెలిపారు. ఈ మధ్యకాలంలో తనతో సన్నిహితంగా మెలిగిన ప్రతి ఒక్కరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని, హోం క్వారంటైన్ కావాలని ఆయన అభ్యర్థించారు.


ఇదిలా ఉంటే హర్యానాలో కొవ్యాక్సిన్ ట్రయల్స్ అనిల్ విజ్‌తోనే ప్రారంభమయ్యాయి. హర్యానా మొత్తం మీద ఆయనే తొలి సారిగా ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొన్నారు.

Updated Date - 2020-12-05T19:15:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising