ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైళ్ల పునఃప్రారంభంపై తుది నిర్ణయం తీసుకోలేదు

ABN, First Publish Date - 2020-04-05T06:59:59+05:30

లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే రైళ్ల పునఃప్రారంభానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈనెల 14న లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత 15వ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోర్డు అనుమతిస్తేనే సేవలు 

ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి గోయల్‌


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే రైళ్ల పునఃప్రారంభానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈనెల 14న లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత 15వ తేదీ నుంచి రైళ్లు నడుస్తాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ శనివారం వివరణ ఇచ్చింది. ప్యాసింజర్‌ రైళ్ల పునఃప్రారంభానికి రైల్వే జోన్లు ఏర్పాట్లు చేస్తున్నాయంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. రైల్వే బోర్డు చైర్మన్‌, ఇతర ఉన్నతాధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం జరిపిన రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు. దశలవారీగా రైల్వే సేవలను ప్రారంభించాలనీ, దానికి సంబంధించిన ప్రణాళికను రైల్వే జోన్లు అనుమతి కోసం బోర్డుకు పంపాల్సి ఉంటుందని ఈ సమావేశంలో నిర్ణయించారని వారు చెప్పారు. 

Updated Date - 2020-04-05T06:59:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising