ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడులో హీరోలకు ప్రజాదరణ లేదు : మంత్రి సీవీ

ABN, First Publish Date - 2020-12-15T17:19:55+05:30

రాజకీయాల్లోకి వస్తున్న సినీ హీరోలకు ప్రజలు మద్దతివ్వరని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : రాష్ట్రంలో రాజకీయాల్లోకి వస్తున్న సినీ హీరోలకు ప్రజలు మద్దతివ్వరని, ఇప్పటిదాకా ప్రజల సంక్షేమం గురించి ఏ మాత్రం పట్టించుకోని సినీ తారలను వారెలా ఆదరిస్తారని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం పేర్కొన్నారు. విల్లుపురంలో సోమ వారం జరిగిన అన్నాడీఎంకే మహిళా విభాగం, యువజన విభాగం, ఐటీ విభాగం నిర్వాహకుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ పురట్చితలైవర్‌ ఎంజీఆర్‌ ప్రారంభించిన అన్నాడీఎంకే ఐదు దశాబ్దాలుగా ఎన్నో ఆటుపోట్లను, అడ్డంకులను ఎదుర్కొని కంచుకోటలా సుస్థిరంగా కొనసాగుతోందన్నారు. 2016లో రెండోసారి అన్నాడీఎంకే అధికారంలోకి రావడానికి మహిళలే ప్రధాన కారణమని, మహిళలంతా ఓటేసి పార్టీలను గెలిపించారని చెప్పారు.


వచ్చే యేడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, ఆ లోపున పార్టీలోని వివిధ విభాగాలకు చెందిన నాయకులంతా కార్యకర్తలతో కలిసి అన్నాడీఎంకే ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలను గురించి ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలిచి వరుసగా మూడుసార్లు అధికారం చేపట్టిన పార్టీగా  రాష్ట్ర రాజకీయ చరిత్రలో కొత్త రికార్డును నెలకొల్పబోతున్నదని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించినంతవరకూ నటీనటులకు ప్రజలు మద్దతు ఇవ్వరని, ప్రజల సంక్షేమం పట్టించుకోని తారలకు ఎలా ఓటేస్తారని ఆయన అన్నారు. పురట్చితలైవర్‌ ఎంజీఆర్‌ మినహా తక్కిన సినీ హీరోలను రాష్ట్ర ప్రజలు ఆదరించడం లేదని పాత చరిత్రను పరిశీలిస్తే అవగతమవుతుందని మంత్రి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సినీ హీరోల పార్టీలు గెలిచే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-12-15T17:19:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising