ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూపాయికే బిందె మినరల్ వాటర్.. కొత్త పథకానికి శ్రీకారం

ABN, First Publish Date - 2020-02-18T15:50:10+05:30

పలు ప్రాంతాల్లో ప్రాథమిక పనులు ప్రారంభించిన నేపథ్యంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : పూర్వ విద్యార్థుల కృషి, సహకారంతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా శుద్ధీకరించిన తాగునీటి పథకాన్ని పుదుక్కోట జిల్లాలోని ఏంబల్‌ గ్రామంలో ప్రభుత్వం అమలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కమిటీ ప్రణాళిక కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1580 తాగునీటి శుద్ధీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. తొలివిడతగా పుదుక్కోట జిల్లాలో ఈ పథకం నిమిత్తం 64 ప్రాంతాలను ఎంపిక చేసే పనులు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో  ప్రాథమిక పనులు ప్రారంభించిన నేపథ్యంలో.. అరిమళం సమీపంలో వున్న ఏంబల్‌ గ్రామంలో రూ.8లక్షల వ్యయంతో తాగునీటి శుద్ధీకరణ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు.


ఏంబల్‌ గ్రామంలోని పూర్వ విద్యార్థులు ఈ ప్లాంట్‌ ఏర్పాటుకు చాలా కృషి చేశారు. ఇక్కడున్న ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ సమీపంలోనే తాగునీటి శుద్ధీకరణ ప్లాంట్‌ ఏర్పాటైంది. ఓవర్‌హెడ్‌ ట్యాంకు నుంచి నీటిని శుద్ధీకరణ కేంద్రాన్ని తరలించి ప్రజలకు వినియోగిస్తున్నారు. ఒక గంటలకు వెయ్యి లీటర్ల చొప్పున శుద్ధీకరించిన నీటిని రోజుకి 12వేల లీటర్ల వరకు పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ఆటోమేటిక్‌ యంత్రంలో ఒక రూపాయి నాణాన్ని వేసి కొన్ని సెకన్లలో 20 లీటర్ల (ఒక బిందె) నీటిని పొందవచ్చు. 20 లీటర్లు సరఫరా అయిన వెంటనే యంత్రం నుండి నీటి రాక ఆగిపోతుంది. మళ్లీ రూపాయి నాణెం వేస్తే నీరు వస్తుంది. ఈ శుద్ధీకరించిన తాగునీరు శుభ్రంగా వుండడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-02-18T15:50:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising