ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా విజృంభణకు తబ్లీగీయే కారణమన్న వ్యక్తి కాల్చివేత

ABN, First Publish Date - 2020-04-05T22:07:48+05:30

దేశంలో కరోనా విజృంభించడానికి తబ్లిఘీ జమాత్ సంస్థే కారణమని టీ షాపులో వాదించిన ఓ వ్యక్తిని మరో వ్యక్తి కాల్చి చంపాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : దేశంలో కరోనా విజృంభించడానికి తబ్లిఘీ జమాత్ సంస్థే కారణమని టీ షాపులో వాదించిన ఓ వ్యక్తిని మరో వ్యక్తి కాల్చి చంపాడు. బాధితుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని నిందితుడ్ని అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం 9:30 గంటలకు ఓ టీ షాపులో వీరిద్దరూ వాదించుకున్నారు.


దేశంలో కరోనా విజృంభణకు తబ్లీఘీ సంస్థే కారణమంటూ బాధితుడు తీవ్రంగా మరో వ్యక్తితో వాదించాడు. ఈ వాదన ముదిరి ముదిరి కాల్చి వేతకు దారితీసినట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఈ సంఘటనపై స్థానిక ఏఎస్పీ మాట్లాడుతూ ప్రజలందరూ శాంతగా ఉండాలని, ఈ విషయంపై ఎవరూ ఘర్షణ వాతావరణానికి దిగొద్దని విజ్ఞప్తి చేశారు. వీరిద్దరి వ్యక్తిగత వివరాలు మాత్రం స్థానిక పోలీసులు బయటపెట్టలేదు.

Updated Date - 2020-04-05T22:07:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising