ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంట్లోనే వైన్ తయారీకి మేఘాలయ గ్రీన్ సిగ్నల్

ABN, First Publish Date - 2020-09-26T13:45:55+05:30

వైన్ ప్రియులకు శుభవార్త. ఇంట్లోనే వైన్ తయారీకి మేఘాలయ సర్కారు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షిల్లాంగ్ (మేఘాలయ): వైన్ ప్రియులకు శుభవార్త. ఇంట్లోనే వైన్ తయారీకి మేఘాలయ సర్కారు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానికంగా వైన్ తయారీని చట్టబద్ధం చేయాలని రెండు దశాబ్దాల డిమాండుకు డెమోక్రటిక్ అలయెన్సు ప్రభుత్వ తలొగ్గి హోంమేడ్ ఫ్రూట్ వైన్సు రూల్ ను ప్రవేశపెట్టింది. మేఘాలయంలో వైన్ తయారీదారులకు లైసెన్సులు ఇవ్వాలని మేఘాలయ మంత్రివర్గం నిర్ణయించింది. మేఘాలయలో ఇంట్లో తయారు చేసిన వైన్ ను మార్కెటులో విక్రయించేందుకు అనుమతిస్తున్నట్లు ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా చెప్పారు. ఇళ్లలోనే వైన్ తయారీకి అనుమతివ్వడం వల్ల ఉత్పాదకత పెరగడంతోపాటు స్థానికులకు ఉపాధి లభిస్తుందని సీఎం చెప్పారు. 


వైన్ తయారీదారులు వ్యాట్ చెల్లించాల్సిన అవసరం లేదని, లైసెన్సు ఫీజు కింద కేవలం 7,500రూపాయలు చెల్లిస్తే చాలని మేఘాలయ అధికారులు చెప్పారు. మేఘాలయ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు మేఘాలయ వైన్ మేకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మైఖేల్ చెప్పారు. పర్యాటకరంగం అభివృద్ధితోపాటు వైన్ తయారీ కుటీరపరిశ్రమగా పురోగతి చెందుతుందని స్థానికులు చెప్పారు.గతంలో మేఘాలయలో స్థానిక క్లబ్ వైన్ ఫెస్టివల్ నిర్వహించింది. 

Updated Date - 2020-09-26T13:45:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising