ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీరట్ సీఏఏ హింసాత్మక నిరసనల కేసులో పీఎఫ్ఐ సభ్యుడి అరెస్ట్!

ABN, First Publish Date - 2020-06-07T03:32:20+05:30

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల పట్టిక (ఎన్ఆర్‌సీ)లకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల పట్టిక (ఎన్ఆర్‌సీ)లకు వ్యతిరేకంగా ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో గత ఏడాది డిసెంబరులో జరిగిన హింసాత్మక నిరసనల కేసుకు సంబంధించి ఓ వ్యక్తిని నోయిడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. 


విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం అరెస్టయిన వ్యక్తి ఘజియాబాద్‌‌లోని మురద్ నగర్ ప్రాంత నివాసి, పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి చెందిన ముఫ్తీ షెహజాద్ అని సమాచారం. 


సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా  గత ఏడాది దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ నేపథ్యంలో జరిగిన హింసాత్మక సంఘటనల్లో పీఎఫ్ఐ ప్రమేయం ఉన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అరెస్టయిన ముఫ్తీ షెహజాద్ ఈ నిరసనల సమయంలో రెచ్చగొట్టే పోస్టర్లను పంపిణీ చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. 


కేంద్ర ప్రభుత్వం భారతీయ పౌరసత్వ చట్టాన్ని సవరించిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల్లో మతపరమైన హింస, వేధింపులను తట్టుకోలేక, భారత దేశానికి వచ్చినవారికి పౌరసత్వం కల్పించేందుకు ఈ సవరణ వల్ల అవకాశం కలిగింది. దీనిని వ్యతిరేకిస్తూ గత ఏడాది డిసెంబరులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి.


Updated Date - 2020-06-07T03:32:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising