ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎండీహెచ్ యజమాని మహాషే ధర్మపాల్ గులాటి కన్నుమూత

ABN, First Publish Date - 2020-12-03T15:40:24+05:30

వివిధ రకాల మసాలాల విక్రేత, ఎండీహెచ్ యజమాని మహాషే ధరంపాల్ గులాటీ గురువారం ఉదయం కన్నుమూశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : వివిధ రకాల మసాలాల విక్రేత, ఎండీహెచ్ యజమాని మహాషే ధరంపాల్ గులాటీ గురువారం ఉదయం కన్నుమూశారు. ఎండీహెచ్ బ్రాండు పేరుతో ధరంపాల్ గులాటి పలు సుగంధద్రవ్యాలను విక్రయిస్తున్నారు. 98 ఏళ్ల గులాటి అనారోగ్యంతో ఢిల్లీలోని మాతాచానన్ దేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. ఎండీహెచ్ కు చెందిన ధరంపాల్ గులాటిని దాదాజీ, మహాషైజీ అని పిలుస్తారు. ఈయన1923లో పాకిస్థాన్ దేశంలోని సియాల్ కోట్ లో జన్మించారు. ధరంపాల్ గులాటీ తన తండ్రి మసాలా వ్యాపారంలో అడుగుపెట్టారు.దేశ విభజన తర్వాత ఢిల్లీకి వలస వచ్చిన గులాటీ కరోల్ బాగ్ ప్రాంతంలో ఒక సుగంధ ద్రవ్యాల దుకాణం ప్రారంభించారు. అక్కడి నుంచి ధరంపాల్ ఎండీహెచ్ మసాలాల తయారీ బ్రాండును తయారు చేశారు. 


గులాటీ 2019లో రాష్ట్రపతి నుంచి పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. గులాటీ మృతి పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలు సంతాపం తెలిపారు.‘మహాషే’ ధరంపాల్ గులాటి ఫొటోలను పంచుకుంటూ, మనీష్ సిసోడియా ట్విట్టర్‌లో ఇలా రాశారు, “భారతదేశపు అత్యంత ఉత్తేజకరమైన పారిశ్రామికవేత్త, ఎండిహెచ్ యజమాని ధర్మ్ పాల్ మహాషే ఈ ఉదయం కన్నుమూశారు. ఇటువంటి ఉత్తేజకరమైన వ్యక్తిని నేను ఎప్పుడూ కలవలేదు. అతని ఆత్మకు శాంతి కలుగుగాక’’ అని సిసోడియా పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-03T15:40:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising