ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగళూరు మేయరు పీఏకు కరోనా..మేయర్ హోం క్వారంటైన్

ABN, First Publish Date - 2020-07-08T11:51:09+05:30

బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) మేయరు పర్సనల్ అసిస్టెంటుకు కరోనా వైరస్ సోకడంతో మేయరు ఎం గౌతం కుమార్ హోం క్వారంటైన్‌లో ఉన్నారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు (కర్ణాటక): బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) మేయరు పర్సనల్ అసిస్టెంటుకు కరోనా వైరస్ సోకడంతో మేయరు ఎం గౌతం కుమార్ హోం క్వారంటైన్‌లో ఉన్నారు.అనారోగ్యానికి గురైన మేయర్ పీఏ ముందు సెలవులో వెళ్లాక కరోనా పరీక్ష చేయించుకోగా అతనికి పాజిటివ్ అని తేలింది. దీంతో మేయరు పీఏను కలిసిన మేయరుతోపాటు ఇతర ఉద్యోగులు, పీఏ కుటుంబసభ్యులు హోంక్వారంటైన్ లో ఉన్నారు. మేయరు గౌతంకుమార్ సోమవారం కర్ణాటక రెవెన్యూశాఖ మంత్రి అశోక్, పలువురు కౌన్సిలర్లతో కలిసి సమావేశం నిర్వహించారు. దీంతో ఈ సమావేశంలో పాల్గొన్న వారంతా హోంక్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నారు. మేయరు సమావేశం నిర్వహించేటప్పటికి తన పీఏకు కరోనా సోకినట్లు తెలియదు. బీబీఎంపీ కేంద్ర కార్యాలయంతోపాటు మేయరు కార్యాలయాన్ని సీలు చేసి శానిటైజ్ చేశారు. గాంధీనగర్ ఎమ్మెల్యే ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని రావడంతో అతనితోపాటు కుటుంబం మొత్తం హోంక్వారంటైన్ లోకి వెళ్లారు. 

Updated Date - 2020-07-08T11:51:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising