ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షూలో దూరి ఎస్పీని కాటేసిన కట్లపాము..!

ABN, First Publish Date - 2020-08-13T03:46:11+05:30

చప్పుడుకాకుండా బూట్లలో దూరిన ఓ కట్లపాము జిల్లా ఎస్పీని కాటేసిన వైనమిది!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పన్నా: చప్పుడుకాకుండా బూట్లలో దూరిన ఓ కట్లపాము జిల్లా ఎస్పీని కాటేసిన వైనమిది! మధ్య ప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సకాలంలో ఆయనను ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పిందని అధికారులు వెల్లడించారు. పాము కాటుకు గురైన ఎస్పీ మయాంక్ అవస్తి ఐపీఎస్ ప్రస్తుతం జబల్పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఆయన తన బూట్లు తొడుక్కోబోతుండగా ఏదో తగుతున్నట్టు అనిపించి కాలు బయటికి తీసి చూడబోయారు. అయితే అప్పటికే లోపల నక్కిన పాము ఆయన వేళ్లపై కాటేసిందని ఏఎస్పీ బీకేఎస్ పరిహార్ పేర్కొన్నారు. ప్రస్తుతం అవస్తి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు ఆయన తెలిపారు. పామును సురక్షితంగా పట్టుకెళ్లి సమీప అడవుల్లో విడిచిపెట్టామన్నారు. కాగా ఎస్పీ షూలో పాము దూరిన దృశ్యాలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా ఉందనీ.. బూట్లు, దుస్తులు ధరించే ముందు తప్పకుండా చెక్ చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

Updated Date - 2020-08-13T03:46:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising