ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగల దుకాణంలో భారీ చోరీ.. భయం.. భయం

ABN, First Publish Date - 2020-10-22T16:26:46+05:30

రాజధానిలో ప్రధానమైన వ్యాపార కూడలి... చుట్టూ అపార్ట్‌మెంట్లు, ప్రముఖులంతా ఉండే ప్రాంతం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : రాజధానిలో ప్రధానమైన వ్యాపార కూడలి... చుట్టూ అపార్ట్‌మెంట్లు, ప్రముఖులంతా ఉండే ప్రాంతం... అక్కడే భారీ స్థాయిలో చోరీ జరగడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. స్థానిక టి.నగర్‌లో ఓ గృహసముదాయంలో ఉన్న నగల దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ.2కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు  దోచుకెళ్ళారు. టి.నగర్‌ బస్టాండు సమీపంలోని మూసా వీథిలో ఉన్న ఓ భవన సముదాయంలో దిగువ, పై అంతస్థుల్లో నివాసాలున్నాయి. ఆ గృహసముదాయంలోని ఓ ప్లాట్‌లో రాజేంద్రబాబు, ఆయన కుమారులు తరుణ్‌, భరీష్‌ నివసిస్తున్నారు. దిగువ అంతస్థులో తరుణ్‌, భరీష్‌ ‘ఉత్తమ్‌ జ్యువెలరీస్‌’ పేరిట నగల దుకాణం నడుపుతున్నారు. మంగళవారం రాత్రి ఇద్దరూ దుకాణాన్ని మూసి ప్లాట్‌కు వెళ్ళిపోయారు. బుధవారం ఉదయం దుకాణం తెరిచేందుకు రాగా దుకాణం ఇనుప గ్రిల్‌ గేట్‌ పగిలి వుండటం చూసి దిగ్ర్భాంతి చెందారు. దుకాణం తలుపు కూడా పగులగొట్టి వుండటం కనిపించింది. దుకాణంలోనికి వెళ్ళి చూడగా లాకర్‌లో భద్రపరచిన నాలుగు కేజీలకు పైగా బంగారు, వజ్రాభరణాలు, బంగారు కడ్డీలు, వెండి వస్తువులు దోపిడీకి గురైనట్లు కనుగొన్నారు.


చోరీకి గురైన నగలు, వెండి వస్తువుల విలువ రూ.2 కోట్లుంటుందని వ్యాపారులు తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో మాంబళం పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. సౌత్‌ చెన్నై డిప్యూటీ పోలీసు కమిషనర్‌ బాబు, అసిస్టెంట్‌ కమిషనర్లు కలియాన్‌, రూబెన్‌ ఇతర పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దోపిడీకి గురైన నగల దుకాణంలో చిల్లర వ్యాపారాలు జరపటం లేదని, టోకుగా బంగారు, వెండి ఆభరణాలను విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఆ భవన సముదాయం వద్ద నున్న సీసీ కెమెరాలలో దోపిడీ దొంగల సంచారం రికార్డయి ఉంటుందని  అనుమానించిన పోలీసులు ఆ కెమెరాలలో నమోదైన వీడియో దృశ్యాల ఆధారంగా విచారణ ప్రారంభించారు. దసరా, దీపావళి పండుగల కోసం ఆ దుకాణంలో అధికమొత్తంలో నగలు, వజ్రాభరణాలు నిల్వ చేసి ఉంచారని పోలీసులు తెలిపారు. వేలి ముద్రల నిపుణులను రప్పించి దొంగల చేతి ముద్రలను కూడా సేకరించారు. ఈ దోపిడీ సంఘటనపై నగల దుకాణంలో పని చేస్తున్న సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. టి.నగర్‌ బస్టాండు సమీపంలో ఉన్న నగల దుకాణంలో దోపిడీ జరుగటం ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం కలిగించింది.

Updated Date - 2020-10-22T16:26:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising