ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ వేళ వీడియో కాల్ సాయంతో వివాహం

ABN, First Publish Date - 2020-04-04T14:04:14+05:30

కరోనావైరస్ లాక్ డౌన్ సందర్భంగా వీడియో కాల్ సాయంతో వివాహం జరిపించిన ఘటన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఔరంగాబాద్ (మహారాష్ట్ర): కరోనావైరస్ లాక్ డౌన్ సందర్భంగా వీడియో కాల్ సాయంతో వివాహం జరిపించిన ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో శుక్రవారం జరిగింది. ఔరంగాబాద్ నగరానికి చెందిన ముహమ్మద్ మిన్ హజుద్ద్, బీడ్ పట్టణానికి చెందిన యువతితో ఏప్రిల్ 3వతేదీన వివాహం జరిపించాలని రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు ఆరునెలల క్రితమే నిర్ణయించారు. పెళ్లిమండపాలు మూసివేయడంతో పాటు కరోనా లాక్ డౌన్ సందర్భంగా ప్రజల రాకపోకలు నిలిచిపోవడంతో వీడియో కాల్ సాయంతో ఇంటి నుంచే  వివాహం జరిపించాలని నిర్ణయించారు.


వధువు, వరుడి కుటుంబాలకు చెందిన వారు వారి వారి ఇళ్లలోనే ఉండి వీడియో కాల్ సాయంతో వివాహ తంతు జరిపించారు. ఖాజీ అయిన ముఫ్తీ అనీస్ ఉర్ రహమాన్ వీరి పెళ్లిని వీడియో కాల్ సాయంతో జరిపించారు. లాక్ డౌన్ వేళ వీడియోకాల్ సాయంతో జరిపిన వివాహం తక్కువ ఖర్చుతోపాటు తమ రెండు కుటుంబాలకు సంతోషాన్నిచ్చిందని వరుడి తండ్రి ముహమ్మద్ గయాజ్ చెప్పారు. 

Updated Date - 2020-04-04T14:04:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising