ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్‌కూ మర్కజ్‌ దెబ్బ

ABN, First Publish Date - 2020-04-06T07:34:11+05:30

భారత్‌ మాదిరిగానే దాయాది దేశం పాకిస్థాన్‌ కూడా తబ్లీగీ మర్కజ్‌ దెబ్బతో అల్లాడుతోంది. లాహోర్‌లో గత నెల 10-12 మధ్య జరిగిన తబ్లీగీ సమ్మేళనానికి పాక్‌ నుంచేగాక ఇతర దేశాల నుంచి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 300 మంది మత పెద్దలకు పాజిటివ్‌
  • లాహోర్‌ సమావేశానికి లక్ష మంది హాజరు

లాహోర్‌ ఏప్రిల్‌ 5: భారత్‌ మాదిరిగానే దాయాది దేశం పాకిస్థాన్‌ కూడా తబ్లీగీ మర్కజ్‌ దెబ్బతో అల్లాడుతోంది. లాహోర్‌లో గత నెల 10-12 మధ్య జరిగిన తబ్లీగీ సమ్మేళనానికి పాక్‌ నుంచేగాక ఇతర దేశాల నుంచి సుమారు లక్ష మంది హాజరైనట్లు తెలిసింది. వీరి నుంచే కోవిడ్‌-19 దేశంలో వేగంగా వ్యాప్తిచెందుతోందని పాక్‌ అధికారులు ఆందోళన చెందుతున్నారు.


ఈ సమావేశానికి హాజరైనవారికోసం నలుమూలలా వెదుకులాట చేపట్టారు. ఇప్పుడు లాహోర్‌ నగరం తూర్పు ప్రాంతంలో వైరస్‌ విజృంభించడంతో అటువైపు నగరాన్ని అష్టదిగ్బంధనం చేశారు. తబ్లీగీ సమావేశానికి హాజరైన 2,500 మంది ఇప్పటికీ అక్కడి మసీదు, పరిసర ప్రాం తాల్లో ఉన్నారు. వీరిలో 1,500 మంది విదేశీయులే. పంజాబ్‌లో 300 మంది ముస్లిం మత పెద్దలకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు సర్కారు ప్రకటించింది.   

Updated Date - 2020-04-06T07:34:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising