ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబాయ్ వ్యక్తితో 11 మందికి కరోనా వచ్చింది...

ABN, First Publish Date - 2020-04-04T11:32:50+05:30

తల్లి అంత్యక్రియల కోసం దుబాయ్ దేశం నుంచి స్వదేశానికి వచ్చిన ఓ వ్యక్తి వల్ల అతని కుటుంబసభ్యులతోపాటు మరో 11 మందికి కరోనా వైరస్ సోకిన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్(మధ్యప్రదేశ్): అనారోగ్యంతో మరణించిన తల్లి అంత్యక్రియల కోసం దుబాయ్ దేశం నుంచి స్వదేశానికి వచ్చిన ఓ వ్యక్తి వల్ల అతని కుటుంబసభ్యులతోపాటు మరో 11 మందికి కరోనా వైరస్ సోకిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మోరీనా పట్టణంలో వెలుగుచూసింది. మోరీనా పట్ణణానికి చెందిన ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో ఉండే వాడు. అనారోగ్యంతో తల్లి మరణించడంతో ఆమె అంత్యక్రియల కోసం మార్చి 17వతేదీన దుబాయ్ నుంచి ఓ వ్యక్తి తన భార్య, పిల్లలతో కలిసి తన స్వస్థలమైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మోరీనా పట్టణానికి తిరిగివచ్చారు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి తన ఇంటి ఇరుగుపొరుగు వారిని తల్లి అంత్యక్రియలు, పెదకర్మల కోసం పిలిచాడు. దుబాయ్ నుంచి వచ్చిన దంపతులకు కరోనా వైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో వైద్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అతనితోపాటు అతని ఇంట్లో ఉన్నవారికి పరీక్షలు జరపగా మరో పదిమందికి కరోనా సోకిందని వెల్లడైంది. దీంతో వైద్యాధికారులు, పోలీసులు దుబాయ్ వ్యక్తి నివాసమున్న ప్రాంతాన్ని సీలు చేశారు. కరోనా వైరస్ సోకిన వారందరినీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. దుబాయ్ వ్యక్తి తల్లి అంత్యక్రియలు, పెదకర్మలో పాల్గొన్న వారందరినీ ముందుజాగ్రత్తగా క్వారంటైన్ కు తరలించారు. 

Updated Date - 2020-04-04T11:32:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising