ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విచారణ జరుగుతుండగా.. జడ్జిపై షూ విసిరిన నిందితుడు

ABN, First Publish Date - 2020-02-05T21:05:16+05:30

ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నిందితుడు విచారణ జరుపుతున్న న్యాయమూర్తిపైకి షూ విసిరాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నిందితుడు విచారణ జరుపుతున్న న్యాయమూర్తిపైకి షూ విసిరాడు. ఈ ఘటన కోల్‌కతాలోని బాంక్‌షాల్ కోర్టులో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగాల్‌కు చెందిన అబు మూసా అనే వ్యక్తికి ఐసిస్‌, జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎంబీ) వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని ఆరోపణలున్నాయి. దీంతో అతన్ని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

 

ఈ కేసుపై మంగళవారం విచారణ జరుగుతుండగా న్యాయమూర్తి ప్రశాంజిత్ బిస్వాస్‌పైకి మూసా షూ విసిరాడు. ఆ షూ జడ్జి ప్రశాంజిత్‌కు తగల్లేదుకానీ, పక్కనే ఉన్న ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది తమాల్ ముఖర్జీకి గట్టిగా తగిలింది. ఈ షూ విసిరేప్పుడు, ‘నాకు మీ చట్టాలపై నమ్మకం లేదు’ అంటూ మూసా పెద్దగా అరిచినట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-02-05T21:05:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising