ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసులు అడ్డుకుంటున్నారని, నదిలో ఈదుతూ స్వగ్రామానికి వెళుతూ...

ABN, First Publish Date - 2020-04-10T17:03:36+05:30

కరోనా లాక్‌డౌన్ వల్ల రోడ్డు మార్గంలో పోలీసులు అడ్డుకుంటున్నారని సొంతింటికి వెళ్లేందుకు నదిలో ఈదటం ప్రారంభించిన బస్సు కండక్టరు అదే నదిలో మునిగి మరణించిన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుబ్బల్లీ (కర్ణాటక): కరోనా లాక్‌డౌన్ వల్ల రోడ్డు మార్గంలో పోలీసులు అడ్డుకుంటున్నారని సొంతింటికి వెళ్లేందుకు నదిలో ఈదటం ప్రారంభించిన బస్సు కండక్టరు అదే నదిలో మునిగి మరణించిన విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపురా జిల్లాలోని కృష్ణానదిలో వెలుగుచూసింది. విజయపురా పట్టణానికి చెందిన బొమ్మనాగి మల్లప్ప 12 ఏళ్లుగా కర్ణాటక ఆర్టీసీ బస్సు కండక్టరుగా పనిచేసేవాడు. ఇతని భార్య ప్రసవం కోసం ఆమె పుట్టిల్లు అయిన సరూర్ గ్రామానికి వెళ్లింది. కండక్టరు భార్యకు కుమార్తె పుట్టింది. మల్లప్ప ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లిన భార్య, కుమార్తెను తిరిగి తీసుకురావాలనుకున్నాడు. మల్లప్ప ఎలాగోలా సరకులు తీసుకువెళ్లే లారీలో సరూర్ గ్రామానికి చేరుకున్నాడు. అనంతరం మల్లప్ప భార్య, కుమార్తెను తీసుకొని మరో లారీలో తన ఇంటికి బయలుదేరాడు. తంగడగి వద్ద లారీ ఆపిన పోలీసులు మల్లప్ప, అతని భార్య, కుమార్తెను కిందకు దించారు. మల్లప్ప తన ఇల్లు కిలోమీటరు దూరంలో ఉండటంతో పోలీసులను ప్రాధేయపడినా అతన్ని అనుమతించలేదు. కేవలం భార్య, తన పాపతో నడిచివెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. మల్లప్ప పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అతన్ని అక్కడే నిలిపివేశారు.


దీంతో మల్లప్ప రోడ్డు మార్గం కాకుండా పక్కనే ఉన్న కృష్ణానదిలో ఈదుతూ కిలోమీటరు దూరం వెళ్లేందుకు ఉపక్రమించాడు. పోలీసుల భయంతో తన ఇంటికి చేరేందుకు నదిలో ఈదుతున్న మల్లప్ప అందులో మునిగి మరణించాడు. మల్లప్ప మృతదేహం అమర్ గల్ ప్రాంతంలో నదిలో లభించింది. పోలీసుల నిర్వాకం వల్లనే తన తమ్ముడు నదిలో మునిగి మరణించాడని, తన తమ్ముడిని పోలీసులు కొట్టారని మల్లప్ప సోదరుడు పరశప్పా ఆరోపించారు. దీనిపై కర్ణాటక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-04-10T17:03:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising