ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యతోనూ భౌతిక దూరం!

ABN, First Publish Date - 2020-12-07T08:19:50+05:30

కరోనా మహమ్మారి సృష్టించిన విలయం ఆ యువకుడిపై తీవ్ర ప్రభావమే చూపింది. కొత్తగా పెళ్లి చేసుకున్నా.. ఎందుకైనా మంచిదని భార్యను దూరం పెట్టాడు. అయితే.. అతడి జాగ్రత్తను నవవధువు మరోలా అర్థం చేసుకుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కరోనా భయంతో వరుడి వైఖరి
  • లైంగిక సామర్థ్య పరీక్షలు కోరిన భార్య
  • మధ్యప్రదేశ్‌లో ఘటన


న్యూఢిల్లీ, డిసెంబరు 6: కరోనా మహమ్మారి సృష్టించిన విలయం ఆ యువకుడిపై తీవ్ర ప్రభావమే చూపింది. కొత్తగా పెళ్లి చేసుకున్నా.. ఎందుకైనా మంచిదని భార్యను దూరం పెట్టాడు. అయితే.. అతడి జాగ్రత్తను నవవధువు మరోలా అర్థం చేసుకుంది. భర్తకు లైంగిక సామర్థ్య పరీక్షల్ని చేయించింది. ఈ ఆసక్తికర ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది. నగరానికి చెందిన యువకుడికి ఈ ఏడాది జూన్‌ 29న పెళ్లైంది. అప్పటినుంచీ భార్యకు దూరంగానే ఉంటున్నాడు. దీంతో అతడి సామర్థ్యాన్ని అనుమానించిన భార్య, అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. తన భర్తకు లైంగిక సామర్థ్యం లేదని, అతడి నుంచి భరణం ఇప్పించాలని కోరుతూ ఈ నెల 2న కోర్టును ఆశ్రయించింది. తనను తాకడం అటుంచి, కబుర్లు కూడా ఆమడ దూరంలో ఉండే చెబుతున్నాడని ఆమె వాపోయింది. ఈ విషయంపై అధికారులు సదరు భర్తను సంప్రదించగా.. పెళ్లి అనంతరం భార్య కుటుంబానికి కరోనా పాజిటివ్‌గా తేలడంతోనే అలా చేశానని వివరించాడు. కరోనా పట్ల విపరీతమైన భయాందోళనలకు లోనవడం(కరోనాఫోబియా) వలనే అతడు అలా ప్రవర్తించాడని అధికారులు గుర్తించారు. యువకుడి లైంగిక సామర్థ్య పరీక్షల్లో ఫలితం పాజిటివ్‌గా వచ్చింది. ఆ విషయాన్నే అధికారులు సదరు భార్యకు తెలిపి ఇద్దరినీ కలపడంతో కథ సుఖాంతమైంది.

Updated Date - 2020-12-07T08:19:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising