ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

93 రూపాయలు తక్కువకొస్తుందని 193 కిలోమీటర్లు వెళ్లాడు.. పోలీసులకు చిక్కాడు

ABN, First Publish Date - 2020-04-08T03:53:56+05:30

కొన్నిసార్లు చిన్న వాటికోసం కక్కుర్తి పడితే పెద్ద పెద్ద కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇంగ్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇదే అనుభవం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాటింగ్‌హమ్: కొన్నిసార్లు చిన్న వాటికోసం కక్కుర్తి పడితే పెద్ద పెద్ద కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇంగ్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇదే అనుభవం ఎదురైంది. తనకు కావలసిన బ్రెడ్ కేవలం 93 రూపాయలు తక్కువ ధరకు వస్తుందన్న కారణంతో ఆ వ్యక్తి 193 కిలోమీటర్ల దూరం కారులో బయలుదేరాడు. అదీ తన ఇద్దరు పిల్లలను వెంట పెట్టుకుని. దీనికితోడు 110కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో అతడు పిల్లలతో బయటకు రావడమే కాకుండా అంతవేగంగా కారు నడుపుతూ పట్టుబడడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి కోర్టుకు సమర్పించారు.


ఈ విషయాన్ని లీసెస్టర్‌షైర్ పోలీసులు తమ ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘ఎం1 నార్త్‌ రోడ్డుపై ఓ వ్యక్తి 110 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతూ పట్టుబడ్డాడు. అతడు నాటింగ్‌హమ్ నుంచి లండన్ వెళ్లడానికి గల కారణం ఏంటో తెలుసా..? కేవలం ఒక్క యూరో(93 రూపాయలు) తక్కువకు బ్రెడ్ వస్తుందన్న కారణంతో 193 కిలోమీటర్లు వెళ్లేందుకు అతడు సిద్ధపడ్డారు. ఇద్దరు చిన్న పిల్లలు కూడా అతడితో కారులో ఉన్నారు. అతడిపై కేసు నమోదు చేసి కోర్టుకు సమర్పించాం’ అంటూ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ పోస్టుకు ‘స్టే ఎట్ హోం.. ప్రొటెక్ట్‌ ద ఎన్‌హెచ్‌ఎస్.. సేవ్ లైవ్స్’ అని రాసి ఉన్న ఫోటోను వారు జత చేశారు.

Updated Date - 2020-04-08T03:53:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising