ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యానికి డబ్బివ్వలేదని.. బాంబు బెదిరింపు

ABN, First Publish Date - 2020-03-16T14:07:23+05:30

బాంబు బెదిరింపులకు పాల్పడిన మద్యం బాబును పోలీసులు అరెస్ట్‌ చేశారు. తంజావూరు జిల్లా ఆడుతురై- అవని యాపురం మధ్య ఉన్న రైలుమార్గాన్ని బాంబులతో పేల్చివేస్తామంటూ శుక్రవారం రాత్రి పోలీసు అత్యవసర నెంబరు ‘100’కు ఫోన్‌ కాల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: బాంబు బెదిరింపులకు పాల్పడిన మద్యం బాబును పోలీసులు అరెస్ట్‌ చేశారు. తంజావూరు జిల్లా ఆడుతురై- అవని యాపురం మధ్య ఉన్న రైలుమార్గాన్ని బాంబులతో పేల్చివేస్తామంటూ శుక్రవారం రాత్రి పోలీసు అత్యవసర నెంబరు ‘100’కు ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన తిరునీలకుడి పోలీసులు రైల్వే పోలీసు లకు సమాచారం అందించారు. వారు బాంబ్‌ స్వ్యాడ్‌ నిపుణులతో ఆ మార్గమంతా గాలించి అది ఫేక్‌ కాల్‌ అని నిర్ధారించారు. దీంతో, పోలీ సులు బెదిరింపు వచ్చిన సెల్‌ఫోన్‌ నెంబరు ఆధారంగా కుంభకోణం ఆడుతురై శెట్టి వీధికి చెందిన ఖాజా నజాముద్దీన్‌ గా గుర్తించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని ఖాజా నజాముద్దీన్‌, అతని కుమారుడు నీషార్‌అహ్మద్‌ను విచారించగా, మద్యానికి డబ్బులు ఇవ్వకపోవడంతో నీషార్‌ తండ్రి సెల్‌ఫోన్‌ నుంచి బాంబు బెదిరింపుకు పాల్పడినట్లు తేలింది. దీంతో, నీషార్‌అహ్మద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.

Updated Date - 2020-03-16T14:07:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising