ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదృశ్యమైన ఆరు నెలల తర్వాత ఇంటికి చేరిన 85 ఏళ్ల వృద్ధుడు

ABN, First Publish Date - 2020-07-12T23:28:57+05:30

మతిమరుపుతో బాధపడుతున్న 85 ఏళ్ల వృద్ధుడు ఇంటి నుంచి అదృశ్యమైన ఆరు నెలల తర్వాత తిరిగి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మతిమరుపుతో బాధపడుతున్న 85 ఏళ్ల వృద్ధుడు ఇంటి నుంచి అదృశ్యమైన ఆరు నెలల తర్వాత తిరిగి కుటుంబం చెంతకు చేరుకున్నాడు. డిల్లీలో జరిగిందీ ఘటన. ఆగ్నేయ ఢిల్లీలోని గోవిందపురి ప్రాంతానికి చెందిన తన తండ్రి దేవ్ నారాయణ్ ఝా కనిపించకుండా పోయాడంటూ ఆయన కుమారుడు ప్రభాకర్ ఝా ఈ ఏడాది జనవరి 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, మనుషుల అక్రమ రవాణా వ్యతిరేక విభాగానికి సంగం విహార్ ప్రాంతంలో ఓ వృద్ధుడు చాలా కాలంగా ఉంటున్నట్టు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసు బృందం  నారాయణ్ ఝా ఫొటోను అక్కడికి వారికి చూపించి గుర్తిస్తే చెప్పాలని సూచించింది. ఈ క్రమంలో శనివారం సంగం విహార్ ప్రాంతంలో ఉన్న వృద్ధుడిని గుర్తించి ఇంటికి తీసుకెళ్లి అప్పగించినట్టు డీసీపీ (సౌత్ ఈస్ట్) ఆర్‌పీ మీనా తెలిపారు.   

Updated Date - 2020-07-12T23:28:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising