ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీపై మమతా సరికొత్త అస్త్రం

ABN, First Publish Date - 2020-12-30T03:19:31+05:30

దీనికి కొద్ది సమయం ముందు మరో సభలో మమతా మాట్లాడుతూ ‘‘బెంగాల్ సంస్కృతిని నాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయి. హింసావాద, విభజనవాద రాజకీయాలు ఆపండి. మహాత్ముడిని గౌరవించని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: భారతీయ జనతా పార్టీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సుప్రెమో మమతా బెనర్జీ సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించారు. భారతీయ జనతా పార్టీ హిందీ మాట్లాడే బయటి వారని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని బెంగాలీలకు సూచించారు. దీనిని బట్టి బెంగాలీలను భాషాపరంగా చూపించి బీజేపీ నుంచి వేరు చేయాలని మమతా బెనర్జీ ఎత్తుగడ వేశారనే విషయం స్పష్టమవుతూనే ఉంది. బోల్‌పూర్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ బీజేపీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.


‘‘రాజకీయ అల్లర్లు ఇక ఆపండి. దేశంలో తీసుకువస్తున్న విభజన రాజకీయాలను బెంగాల్‌లోకి తీసుకురాకండి. బెంగాల్ ప్రజలకు నేను ఒక విజ్ణప్తి చేస్తున్నాను. మన ప్రాంతంలో ఎవరైనా బయటి వ్యక్తులు కనిపిస్తే, అవసరమైతే పోలీసులకు సమాచారం అందించండి. కొంత బయటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి రాష్ట్రాన్ని ఉగ్రవాదంలోకి నెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో మనమంతా ఒకటిగా ఉండి, అలాంటి వారికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి’’ అని మమతా బెనర్జీ అన్నారు.


దీనికి కొద్ది సమయం ముందు మరో సభలో మమతా మాట్లాడుతూ ‘‘బెంగాల్ సంస్కృతిని నాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయి. హింసావాద, విభజనవాద రాజకీయాలు ఆపండి. మహాత్ముడిని గౌరవించని వారు ఈరోజు ‘సోనార్ బంగ్లా’ (బంగారు బెంగాల్) అంటూ మోసగించాలని చూస్తున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కొద్ది దశాబ్దాల క్రితమే బెంగాల్‌ను సోనార్ బంగ్లాగా మార్చారు. ఇప్పుడు చేయాల్సిందల్లా బీజేపీ లాంటి మతతత్వ శక్తుల నుంచి ఆ సోనార్ బంగ్లాను కాపాడుకోవడమే’’ అని అన్నారు.

Updated Date - 2020-12-30T03:19:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising