ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిలబస్ కుదింపులో సీబీఎస్ఈ తీరుపై మమత బెనర్జీ దిగ్భ్రాంతి

ABN, First Publish Date - 2020-07-08T23:38:51+05:30

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వివిధ తరగతులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వివిధ తరగతులకు సిలబస్ తగ్గించిన తీరును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ తప్పుబట్టారు. పౌరసత్వం, సమాఖ్య వ్యవస్థ, దేశ విభజన వంటి అంశాలపై పాఠ్యాంశాలను తొలగించడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 


కోవిడ్-19 మహమ్మారి నిరోధం కోసం అమలు చేస్తున్న అష్ట దిగ్బంధనం కారణంగా పాఠశాలలను మూసివేశారు. ఈ నేపథ్యంలో సిలబస్‌ను తగ్గించాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. 


మమత బెనర్జీ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో ముఖ్యమైన పాఠాలను తొలగించవద్దని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను కోరారు. 


‘‘కోవిడ్ సంక్షోభ సమయంలో సీబీఎస్ఈ కోర్సు కుదింపు పేరుతో పౌరసత్వం, సమాఖ్య వ్యవస్థ, లౌకికవాదం, దేశ విభజన వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతి చెందాను. దీనికి మేము గట్టిగా అభ్యంతరం చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ముఖ్యమైన పాఠాలను తొలగించకుండా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం, హెచ్ఆర్‌డీ మినిస్ట్రీలను కోరుతున్నాను’’ అని మమత పేర్కొన్నారు. 


కోవిడ్-19 మహమ్మారి నిరోధం కోసం అమలు చేస్తున్న అష్ట దిగ్బంధనం వల్ల పాఠశాలలు మూతపడిన సంగతి తెలిసిందే. 2020-21 విద్యా సంవత్సరంలో కొంత సమయం నష్టపోవడంతో సీబీఎస్ఈ 9 నుంచి 12 తరగతుల వరకు సిలబస్‌లో 30 శాతం తగ్గించింది. కొత్త సిలబస్ వివరాలను బుధవారం ప్రకటించింది.


Updated Date - 2020-07-08T23:38:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising