ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడి గంటలు మోగనున్నాయ్... మమత ప్రకటన

ABN, First Publish Date - 2020-05-29T23:34:06+05:30

దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్ 4.0 ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రార్థనా స్థలాలను తిరిగి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్ 4.0 ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రార్థనా స్థలాలను తిరిగి తెరవనున్నట్టు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. దీంతో ప్రార్థనా స్థలాలు తెరువనున్నట్టు ప్రకటించిన మొదటి రాష్ట్రంగా పశ్చిమబెంగాల్ నిలువనుంది. జూన్ 1 నుంచి మరో 15 రోజుల పాటు కేంద్రం మరో విడత (5.0) లాక్‌డౌన్ పొడిగించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతున్న తరుణంలో మమత ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.


8 నుంచి ఫుల్ స్వింగ్...

జూన్ 8వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలన్నీ 100 శాతం పూర్తి సామర్థ్యంతో తెరవాలని కూడా పశ్చిమబెంగాల్ సర్కార్ నిర్ణయించింది. 'గత రెండు నెలల్లో కోవిడ్-19 వ్యాప్తిని విజయవంతంగా అదుపు చేశాం. బయట నుంచి జనం రావడంతో ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి' అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. దీనికి ముందు, సామాజిక దూరం నిబంధనలతో ప్రార్థనా స్థలాలు తెరుచుకునేందుకు అనుమతించాలంటూ ప్రధాని మోదీకి మమతా బెనర్జీ లేఖ రాశారు.

Updated Date - 2020-05-29T23:34:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising